Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి బొజ్జల రామకృష్ణారెడ్డికి పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆంద్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో ఆదివారం నివాళులర్పించారు. బొజ్జల మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంటే ఎంతో గౌరవమని తెలిపారు. తామిద్దరం ఒకే సారి రాజకీయాల్లోకి వచ్చామని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో శ్రీకాళహస్తిలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల, ఉమ్మడి రాష్ట్రంలో అటవీశాఖ మంత్రిగా, ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రిగా పనిచేసారని తెలిపారు.