Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్టీసీలో పరాకాష్టకు చేరిన వేధింపులు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 10,2022

ఆర్టీసీలో పరాకాష్టకు చేరిన వేధింపులు

- తిరగబడుతున్న కార్మికులు
- వెల్లువెత్తుతున్న నిరసనలు
- డొక్కు బస్సులతో మైలేజ్‌ ఎలా?
- 6,500 బస్సుల్లో 5,155 స్క్రాప్‌ బస్సులే...
- మైలేజ్‌ తేకుంటే జీతంలో కోస్తామంటూ నోటీసులు
- హడలెత్తుతున్న డ్రైవర్లు...
- టిక్కెట్లు చింపేసి కండక్టర్లపై కేసులు రాస్తున్న చెకింగ్‌ స్క్వాడ్స్‌
- వీఆర్‌ఎస్‌ అమలుకు యాజమాన్యం డొంకదారులు
- తీవ్ర మనోవేదనలో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు
ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రీ
                 టీఎస్‌ ఆర్టీసీలో సంక్షేమ మండళ్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ పలుమార్లు ప్రకటించారు. కార్మిక సంఘాలు అనవసరంగా రోడ్డెక్కుతున్నాయనీ, యాజమాన్యంతో కలిసి రావాలనీ పిలుపునిచ్చారు. సంక్షేమ మండళ్లు అంతబాగా పనిచేస్తే రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్లు ఎందుకు సంయమనం కోల్పోతున్నారో, నిరసనలకు దిగుతున్నారో అర్థం కావట్లేదు. నిత్యం ఏదో ఒక బస్‌ డిపోలో యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు గళం ఎత్తుతూనే ఉన్నారు.
నిజామాబాద్‌లో...
                 నిజామాబాద్‌ ఆర్టీసీ డిపో-2లో డ్రైవర్‌ గణేష్‌ నగంగా డిపో మేనేజర్‌ ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. 15 ఏండ్లుగా ఆయన అదే డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఒక్క రిమార్కు కూడా ఆయనపై లేదు. కిలో మీటర్‌ పర్‌ లీటర్‌ (కేఎమ్‌పీఎల్‌) తగ్గిందంటూ ఈ మధ్యే ఆయన్ని డిపో మేనేజర్‌ దగ్గరకు కౌన్సిలింగ్‌కు పంపారు. వారం తిరక్కుండానే మళ్లీ మైలేజ్‌ తక్కువ వస్తుందంటూ కౌన్సిలింగ్‌ కోసం డిపో మేనేజర్‌ దగ్గరకు వెళ్లమని నోటీసు ఇచ్చారు. దీంతో సహనం నశించిన గణేష్‌ డిపో మేనేజర్‌ ఎదుట బట్టలు విప్పేసి, నిరసన తెలిపారు. డొక్కు బస్సులు ఇచ్చి మైలేజ్‌ తెమ్మంటే ఎలా వస్తుందని ప్రశ్నించారు. దీనిపై యాజమాన్యం స్పందించలేదు...ఆదేదో చిన్న విషయంగా పట్టించుకోనట్టే వ్యవహరించింది.
మిథాని డిపోలో...జీతం నుంచి రికవరీ...
                 మిథాని డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జీ వెంకన్నకు డిపో మేనేజర్‌ నోటీసు ఇచ్చారు. ''ఏప్రిల్‌ నెలలో మీరు సుమారు 4,400 కి.మీ., నడిపించినారు. 948 లీటర్ల డీజిల్‌ ఖర్చు చేసినారు. 4.64 కేఎమ్‌పీఎల్‌ తెచ్చినారు. కానీ బస్సు యొక్క రకం సూపర్‌ లగ్జరీ. కేఎమ్‌పీఎల్‌ 5.20 గా ఉన్నది. మీరు 5.20కి బదులుగా 4.64 కేఎమ్‌పీఎల్‌ తెచ్చినారు. దీనివల్ల 102 లీటర్లు ఎక్కువ ఖర్చు చేశారు. నష్టము రూ.10,710. ప్రస్తుతం డిపో రూ. మూడు కోట్ల నష్టంలో ఉన్నది. మీవల్ల అదనంగా నష్టం పెరుగుచున్నది. కావున మీరు చేసిన నష్టమును మీ జీతము నుండి రికవరీ ఎందుకు చేయకూడదో ఏడు రోజుల్లో వివరణ ఇవ్వగలరు''...ఇదీ ఆ నోటీసు సారాంశం.
పరిగిలో మహిళా కండక్టర్‌ అదృశ్యం...
                 ఆర్టీసీ అధికారుల వేధింపులు భరించలేక పరిగిలో అలకుంటు లక్ష్మి అనే మహిళా కండక్టర్‌ అదృశ్యమైంది. ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన ఆమెకు ధైర్యం చాల్లేదు. ఇటీవలే ఆమె కూతురు చనిపోయింది. ఆ బాధను కడుపులో దిగమింగుకొని డ్యూటీకి వస్తే టీటీఐ (చెకింగ్‌ స్క్వాడ్‌)లు కుట్ర పూరితంగా తనపై తప్పుడు కేసు రాసారని మనస్తాపానికి గురై మార్గమధ్యంలోనే బస్సు దిగిపోయి అదృశ్యమైంది. ప్రయాణీకులకు తాను టిక్కెట్లు ఇస్తే, టీటీఐలు ఉద్దేశ్యపూర్వంగా వాటిని మాయం చేసి తనపై కేసు రాసారనేది ఆమె ఆవేదన. మూడు రోజుల తర్వాత పోలీసులు ఆమెను కనుగొని, పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు.
మహేశ్వరంలో...
                 ఈ డిపోలో చెన్నకేశవులు కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గత నెల 30న డ్యూటీకి వచ్చినా, అక్కడి సహాయ మేనేజర్‌ ఎన్‌ యాకూబ్‌ ఆబ్సెంట్‌ వేశారు. దీనిపై వివరణ కోరితే 'అదంతే' అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో సహనం నశించిన చెన్నకేశవులు డిపోలోనే యాకూబ్‌పై దాడి చేసి, గాయపరిచాడు. గతంలోనూ డిపో అధికారులు డ్రైవర్‌, కండక్టర్ల పట్ల ఇలాగే వ్యవహరించారనీ, డ్యూటీకి వస్తే ఆబ్సెంట్లు వేసి జీతంలో కోత పెడుతున్నారని చెన్నకేశవులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయనపై మహేశ్వరం పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇవి కొన్నే...
                 ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఘటనలు నిత్యం డిపోల్లో కార్మికులు ఎదుర్కొంటున్నా రు. సంస్థను లాభాల్లోకి తేవాలంటే కార్మికుల సహకారాన్ని యాజమాన్యం కోరాలి.కానీ పొమ్మనలేక పొగబెట్టినట్టు కార్మికుల్ని మానసికంగా కుంగదీసి, వాళ్లంతట వాళ్లే వీఆర్‌ఎస్‌ తీసుకొని ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయేలా యాజమాన్యం వ్యవహరిస్తున్న దని కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి.
సంక్షేమ మండళ్లు ఏవి సారూ...?
                 ఆర్టీసీలో ఇన్ని వరుస సంఘటనలు జరుగుతుంటే సంస్థ చైర్మెన్‌, ఎమ్‌డీ చెప్తున్న సంక్షేమ మండళ్లు ఎక్కడ ఉన్నాయని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారాన్ని అర్థించకుండా, దాన్ని ప్రిస్టేజ్‌గా తీసుకొని, తమంత తామే అన్నీ సర్దుబాటు చేస్తామనే ధోరణిని యాజమాన్యం విడనాడాలని హితవు చెప్తున్నాయి. 2015 తర్వాత ఇప్పటి వరకు కార్మికులకు రావల్సిన రెండు వేతన సవరణలు ఎందుకు అమలు చేయలేదో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్పొరేషన్‌ ఉద్యోగులకు సైతం పీఆర్సీ అమలు చేస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నదని ప్రశ్నిస్తున్నారు. ప్రజారవాణాను సామాజిక బాధ్యతగా చూడటం మానేసి, దాన్ని వ్యాపార, వాణిజ్య పరంగా చూస్తే ఫలితాలు రావనీ, ఆర్టీసీ చచ్చిపోతుందని ఓ కార్మిక సంఘ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం అనసవరమైన భేషజాలకు వెళ్లకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నాయి. ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.
అద్దె బస్సులదే హవా...
                 ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీలో దాదాపు 6,500 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరినాటికి వాటిలో 5,155 బస్సులు తుక్కు (స్క్రాబ్‌)గా మారుతున్నాయి. వీటిలోనూ దాదాపు 4వేల బస్సులు ఇప్పటికే తుక్కు కింద మారాయి. అయినా వాటికి మరమ్మతులు చేసి రోడ్లపై తిప్పుతున్నారు. ఈ డొక్కు బస్సులకు మైలేజ్‌ రావట్లేదంటూ కార్మికులను రాచిరంపాన పెడుతున్నారు. ఇవికాకుండా ఇదే ఆర్టీసీలో మరో మూడువేల అద్దెబస్సులు ఉన్నాయి. తుక్కు కింద మారిన ఆర్టీసీ బస్సుల్ని తీసేస్తే మిగిలేది కేవలం 1,445 బస్సులు మాత్రమే. ఇటీవలే ఆర్టీసీకి మరో వెయ్యి బస్సులు కొంటామని ఆ సంస్థ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ ప్రకటించారు. ఆ సంఖ్యను కూడా కలుపుకుంటే ఆర్టీసీలో ఉండేది కేవలం 2,445 బస్సులు మాత్రమే. అంటే అద్దె బస్సులకంటే ఆర్టీసీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నమాట! మరి రాష్ట్రంలో ఆర్టీసీ ఉన్నట్టా...ఉనికి కోల్పోతున్నట్టా??

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.