Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం అందించే వనరులను అందుకుని వసతిగృహాల్లో ఉంటే విద్యార్థులు అనేక రంగాల్లో రాణించాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం చెప్పారు. బుధవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన జిల్లా వెనుకబడిన తరగతుల సమ్మర్ కల్చరల్ కార్నివాల్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరాలన్న పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని చెప్పారు. లలిత కళల్లో ప్రవేశం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాదు జిల్లా అధికారులు సూర్యలత, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.