Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన జాతీయ స్థాయి ఉద్యమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మద్ధతు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో జేఏసీ నాయకులు సమావేశమై చర్చించారు. త్వరలోనే హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వారు ఆయనకు తెలిపారు. జాతీయ స్థాయిలో బంజారా కులస్థులకు రిజర్వేషన్ విధానం ఒకే విధంగా ఉండేందుకు తాము పోరాడుతున్నట్టు వారు చెప్పారు.