Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్... సమ్మర్ హీట్.. సేల్స్ పీక్
- గతేడాదితో పోల్చితే 90.77శాతం పెరిగిన అమ్మకాలు
- రాష్ట్రంలోనే 150శాతం అమ్మకాలతో కరీంనగర్ జిల్లా ఫస్ట్
- రాష్ట్రానికి ఒక్క నెలలోనే మద్యంపై 20శాతం ఆదాయం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
సమ్మర్ హీట్‌తో బీర్ బాటిళ్ల సేల్స్ పీక్ స్టేజ్‌కి వెళ్లాయి. గతేడాది ఏప్రిల్ మాసంతో పోల్చితే ఈ ఏప్రిల్‌లో 90.77శాతం అమ్మకాలు పెరిగాయి. అందులో రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా 150శాతం అమ్మకాలతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన ఏప్రిల్ అమ్మకాల గణాంకాలే అద్దం పడుతున్నాయి.
మార్చి చివరి మాసం నుంచి ఎండలు ముదరడం, మరోవైపు ఉక్కబోత నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్ బీర్ చేతపట్టారు. అయితే బ్రాందీ, విస్కీ సేవనంపై పెద్దగా ఆసక్తి చూపకపోయినా గతేడాదితో పోల్చితే లిక్కర్ అమ్మకాలూ రాష్ట్రవ్యాప్తంగా 3.06శాతం పెరిగాయి. మొత్తం లిక్కర్ అమ్మకాల విలువజూసినా గతేడాది ఏప్రిల్‌లో రూ.2269కోట్లు రాగా, గత నెల రూ.2701 కోట్లుగా నమోదైంది.
ప్రధానంగా ఎండాకాలం మొదలైనప్పటి నుంచి బీరు బాటిళ్ల కేసులకు కేసులు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26,12,694 బీరుకేసులు గతేడాది అమ్ముడవుతే.. ఈ ఏప్రిల్‌లో 49,84,285కేసుల అమ్మకాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఏకంగా 90.77శాతం అధికంగా బీరు అమ్మకాలు జోరందుకున్నాయి.
గతేడాది ఏప్రిల్‌లో కరీంనగర్ జిల్లా మద్యం ప్రియులు 72,738 కేసుల బీరు తాగేయగా.. ఈ ఏడాది 1,82,009 కేసుల బీరు తాగారు. రాష్ట్రంలోని 150శాతం అమ్మకాలతో కరీంనగర్ జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. పెద్దపల్లి జిల్లా కొంత వెనుకబడగా.. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోనూ 100.78, 111.76శాతం అమ్మకాలు పెరిగాయి. ఇక ఉమ్మడి మెదక్‌లోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోనూ 120 నుంచి 148శాతం బీరు అమ్మకాలు జరిగాయి. తరువాతి స్థానంలో రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు వంద శాతంపైగా బీరు అమ్మకాలు పెరగగా.. మిగతా జిల్లాల్లో 71శాతం నుంచి వందలోపు బీరుకేసులు అమ్ముడయ్యాయి. ఈ పరిస్థితిని గమనిస్తుంటే మే మాసం ముగిసే నాటికి బీరు అమ్మకాలు 150శాతం నుంచి 200శాతం పెరిగే అవకాశాలు లేకపోలేదని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్ర ఆదాయ వనరుల్లో ప్రధానమైన మద్యం అమ్మకాలు ఏయేటికాయేడు జోరందుకోవడం గమనార్హం.
2021 ఏప్రిల్, 2022 ఏప్రిల్ మాసాల్లో సాగిన మద్యం అమ్మకాల్లో తేడాలు
ఉమ్మడి జిల్లా బీర్‌అమ్మకాలు (కేసుల్లో) పెరిగిన అమ్మకాల మొత్తం లిక్కర్ ఆదాయం (రూ.కోట్లలో)
2021 2022 శాతం 2021 2022
ఆదిలాబాద్ 1,28,927 2,50,678 94.43 రూ.134.2 రూ.139.55
హైదరాబాద్ 2,25,907 3,76,408 66.62 రూ.245.22 రూ.260.49
కరీంనగర్ 2,45,393 5,17,486 110.88 రూ.185.53 రూ.238.25
ఖమ్మం 1,28,714 2,10,720 63.71 రూ.173.99 రూ.178.48
మహబూబ్‌నగర్ 2,24,479 4,15,061 84.9 రూ.183.27 రూ.210.67
మెదక్ 2,11,604 4,70,027 122.13 రూ.182.83 రూ.237.78
నల్గొండ 3,20,814 5,28,941 64.87 రూ.255.35 రూ.279.37
నిజామాబాద్ 1,38,186 2,86,451 107.29 రూ.108.70 రూ.132.83
రంగారెడ్డి 6,64,778 13,49,312 103.98 రూ.589.15 రూ.743.33
వరంగల్ 3,27,192 5,79,201 77.02 రూ.213.17 రూ.280.61
మొత్తం 2612694 4984285 90.77 రూ.2269 రూ.2701.37