Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతపరమైన విభజన సష్టించే ప్రయత్నం
- ప్రసంగం ఆద్యంతం అబద్ధాలే : అమిత్‌షా సభపై తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన సందర్భంగా తుక్కుగూడ సభలో బాధ్యతారహితంగా మాట్లాడటాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈమేరకు ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అధికారం ఇస్తే పాలమూరు-రంగారెడ్డి, ఆర్‌డీిఎస్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనీ, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడంతోపాటు మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇది ప్రజల్లో మతపరమైన విభజన సృష్టించే ప్రయత్నమని విమర్శించారు. ఇది తీవ్ర ఆక్షేపణీయమని పేర్కొన్నారు. గత ఎనిమిదేండ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలేవీ అమలు చేయలేదని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరిస్తూ...ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని పేర్కొన్నారు. లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న ఎనిమిది లక్షల ఖాళీల భర్తీ మాటెత్తకుండా తెలంగాణలో ఉద్యోగాలు ఇస్తాననడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అవకాశం ఇస్తే ఏదో ఒరగబెడతామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఓట్ల కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి సామరస్యంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు ఇలాంటి వాటిని తిప్పికొడతారని హెచ్చరించారు.