Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఆదివారం ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ విభాగం, ల్యాబ్స్ పనితీరు, సాధించిన పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని తెలిపారు. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకు దారి తీస్తుందన్నారు. కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఒక వైపు కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎక్కడైనా కల్తీ జరిగినట్టు, నాణ్యత లేనట్టు సమాచారం ఉంటే.. 040 21111111 నెంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.