Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక నుంచి అక్రమంగా తెలంగాణకు వడ్లు తరలింపు
- చెక్‌పోస్టుల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
- మక్తల్ సీఐ సీతయ్య, ఎస్‌ఐ రాములు
నవతెలంగాణ - మక్తల్
తెలంగాణ, కర్నాటక సరిహద్దయిన నారాయణ పేట జిల్లా కృష్ణ బ్రిడ్జి నుంచి 16 లారీల వడ్డు అక్రమంగా తెలంగాణలోకి ప్రవేశిస్తున్న వాటిని పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కర్నాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం చేగుంట కృష్ణ బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలోకి అక్రమంగా వడ్లు తరలుతున్నాయన్న సమాచారంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజామున మక్తల్ సీఐ సీతయ్య ఎస్‌ఐ రాములు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నాటక సరిహద్దుల్లో చేసిన తనిఖీల్లో దాదాపు 16 లారీలను పట్టుకున్నామని తెలిపారు.
డ్రైవర్లు పొంతన లేని సమాధానాలు చెబుతూ సరైన పత్రాలను చూపించలేదని, దాంతో అనుమానం వచ్చి పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టగా కర్నాటకలో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా తెలంగాణకు తరలించి ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను విక్రయిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. అయితే కర్నాటకలో వడ్లు రేట్లు తక్కువగా ఉండటంతో అక్కడి దళారులు తెలంగాణలోకి పెద్ద ఎత్తున అక్రమ మార్గంలో వరి ధాన్యాన్ని తరలించి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతూ లాభాలను ఆర్జిస్తున్నారని తెలిపారు. ఇకనైనా జిల్లా అధికారులు చెక్ పోస్టుల వద్ద కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు అదేశించారు.