Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలిస్తామని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ చెప్పారు. ఇప్పటికే వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గిరిజనుల జనాభా ప్రకారం 10శాతం రిజర్వేషన్లు కూడా ఇస్తామని వివరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గిరిజన నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలపై చర్చించి, పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ గూడెం, తండాల్లో పోడు భూముల సమస్యపై ప్రజలను చైతన్యం చేస్తామన్నారు.ఫిబ్రవరి 15న సేవాలాల్ జన్మదినాన్ని, కొమురం భీమ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్ రంగంలో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనీ, అందు కోసం కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు.