Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమ్స్‌ను నిర్వీర్యం చేస్తున్న సర్కారు
- డిప్యూటేషన్‌పై సిబ్బంది తరలింపు : బక్క జడ్సన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాల ఒత్తిడిమేరకే టిమ్స్ ఆస్పత్రిని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కజడ్సన్ విమర్శించారు. ఈమేరకు మంగళవారం కాంగ్రెస్ బృందంలో కలిసి ఆయన ఆస్పత్రిని పరిశీలించారు. టిమ్స్‌లో పని చేస్తున్న సిబ్బందిలో 50శాతం మందిని డిప్యూటేషన్‌పై ఇతర ఆస్పత్రులకు పంపించారని పరిశీలనలో తేలినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 మంది రెసిడెంట్ డాక్టర్లు, ఆరుగురు సీనియర్ వైద్యులు, 145మంది నర్సులను డిప్యూటేషన్‌పై ఇతర ఆస్పత్రులకు పంపిస్తున్నారని విమర్శించారు.దీంతో వైద్యానికి పేద ప్రజలను దూరంగా ఉంచాలని భావిస్తున్నారా? అని సీఎంను ప్రశ్నించారు. ఇదే అంశంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుపై ఆయన జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అత్యంత నిరుపేదలే ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారనీ, ఈ సమయంలో డాక్టర్లను డిప్యూటేషన్‌పై పంపించడమేంటని ఆయన ప్రశ్నించారు. పేదలకు వైద్యం అందకుండా చేసి, కార్పొరేట్ ఆస్పత్రులకు లబ్ది చేకూర్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పేదల పట్ల ఇంత ద్వేషమెందుకని ప్రశ్నించారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు అత్యంత అవినీతిపరుడంటూ విజిలెన్స్ శాఖ తేల్చిందని గుర్తు చేశారు. ప్రమోషన్లు, పోస్టింగుల్లో తన ఇష్టానుసారం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం స్పదించి టిమ్స్‌లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి, పేదలకు వైద్యం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌యాదవ్, దుగ్యాల వేణు, సాయిలు తదితరులు ఉన్నారు.