Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క ప్రమోషన్ లేకుండా రిటైర్ అవుతున్న టీచర్లు : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
- ప్రక్రియను ప్రారభించకపొతే మే 31న ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా : యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు జంగయ్య
నవతెలంగాణ- విలేకరులు
ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలో నర్సిరెడ్డి మాట్లాడారు. నాలుగేండ్లుగా బదిలీలు, ఏడేండ్లుగా ఉద్యోగోన్నతులు, 15 ఏండ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీకాక విద్యాశాఖ తీవ్ర సంక్షోభంలో ఉందని చెప్పారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు పీఓ 2018 ప్రకారం బదిలీలు, ఉద్యోగోన్నతులకు ఆటంకాలు తొలగిపోయాయని తెలిపారు. దీంతో విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభం పరిష్కారానికి మార్గం సుగమమైందన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపడతామని సీఎం కేసీఆర్ మార్చి10న ప్రకటించారని గుర్తు చేశారు. దాని ప్రకారం వెంటనే బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. చాలామంది టీచర్లు ప్రమోషన్లకు నోచుకోకుండానే రిటైర్ కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూఎస్‌పీసీ నాయకులు యడ్ల సైదులు, పి.వెంకులు, రామకృష్ణ, రత్తయ్య రత్తయ్య, ఖుర్శింద్ మీయా, షాహీన్ తయ్యబ్, పెరుమాళ్ళ వెంకటేశం, నంద్యాల రాజశేఖర్ రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, నాగమణి, బక్క శ్రీనివాసాచారి,సరళ, నర్రా శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదు ట ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగేశ్వరచారికి వినతిప త్రం అందజేశారు. ఈ కార్యక్రమ ంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు తునికి విజరు సాగర్, ముక్కెర్ల యాదయ్య, ఎస్.లక్ష్మీ నరసింహారెడ్డి తదితరు లు పాల్గొన్నారు. యూఎస్‌పీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యా యులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు జంగయ్య మాట్లాడుతూ.. అనేక మంది ఉపాధ్యాయులు సర్వీస్‌లో ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా రిటైర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్సీలతో, సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ షెడ్యూల్ ను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని చెప్పా రు. 317జీవో అప్పీళ్లను పరిష్క రించాలని, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎమ్ పోస్టులను మంజూ రు చేయాలని, ఈహెచ్‌ఎస్ కొరకు2శాతం చందా మినహా యింపు విషయంలో ముందుకు వెళ్లరాదనీ డిమాండ్ చేశారు. వెంటనే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను ప్రారభించకపొతే మే 31న ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు రవీందర్,హరికృష్ణ, శ్రీనునాయ క్, మక్సూద్, శారద, ఉపాధ్యా యులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్త ంగా నిరసనలు జరిగాయి.