Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వయం సహాయక సంఘాలు- బ్యాంక్ లింకేజి ద్వారా 2022-23 సంవత్సరానికి రూ.18,069.93 కోట్లు వార్షిక ప్రణాళికను నిర్దేశించుకున్న సెర్ప్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లో స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు మాట్లాడుతూ మహిళా రుణాలకు రీపేమెంట్ వంద శాతం ఉంటుందని తెలిపారు. మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రాసెసింగ్ రెన్యూవల్ ఫీ విషయంలో సడలింపు ఇవ్వాలని కోరారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ మహిళా సంఘాలకు విరివిగా రుణాలివ్వాలని కోరారు. ప్రభుత్వపరంగా ఐకేపీ, స్త్రీనిధి ద్వారా కోట్లాది రూపాయలు రుణాలుగా ఇస్తున్నామని తెలిపారు. మహిళలు స్థానికంగా తామున్న చోట అవసరాలను గుర్తించి వ్యాపారాలు చేయాలని సూచించారు. మహిళలు ఎదిగితే రాష్ట్రం, దేశం బాగుపడతాయన్నారు. మహిళా సంఘాలపై నమ్మకం పెరిగి బ్యాంకులు జమానతు లేకుండా రుణాలిస్తున్నాయని మంత్రి తెలిపారు. కల్తీ ఉత్పత్తులను నివారించాలంటే మహిళా సంఘాల నుంచి ఉత్పత్తులు రావాల్సి ఉందన్నారు. ఆహారోత్పత్తుల రంగంలో మహిళా సంఘాలు మరింత రాణించాలని ఆకాంక్షించారు.
సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ ఒకప్పుడు పదివేల బ్యాంకు రుణం ఇవ్వాలంటే భయపడే బ్యాంకులు నేడు మహిళా సంఘాలకు లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం వెనుక వారి పైన ఉన్న నమ్మక మే అన్నారు. . ఎస్‌హెచ్‌జి గ్రూపుల ఎల్‌పిఎ 1.9 శాతం ఉండటం అంటేనే వారి చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ డైరెక్టర్ వై.ఎన్య రెడ్డి, ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ యశోద బాయి, ఎస్‌ఎల్ బీసీ కన్వీనర్ కృష్ణ శర్మ, నాబార్డ్ జనరల్ మేనేజర్ హరగోపాల్, బ్యాంకుల ప్రతినిధులు, సెర్ప్ ఉద్యోగులు, డీఆర్‌డీవో పీడీలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.