Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితులను ఆదుకుంటామని హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ వద్ద ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు మరణించడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబాలకుతన సానుభూతిని ప్రకటించారు. బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.