Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (పీఎస్‌హెచ్‌ఎం) 5,571 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సంబంధిత దస్త్రంపై ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావు బుధవారం సంతకం చేశారు. పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను పదివేల వరకు పెంచుతామంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా 5,571 నూతన పోస్టుల మంజూరు కోసం తయారు చేసిన దస్త్రంపై ఆయన సంతకం చేశారు. వారం రోజుల్లో జీవో విడుదలయ్యే అవకాశమున్నట్టు తెలిసింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.