Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్న
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మేసి కేంద్రప్రభుత్వం ఏం చేయబోతుందో బీజేపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత అడిగారు. చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటకతో పాటు ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తున్నదని తెలిపారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసమే వినియోగిస్తారా... ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ ఆస్తులు అమ్మి, రాష్ట్రంలో మీరు ఏం చేయబోతున్నారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.