Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 నుంచి పాదయాత్ర పున:ప్రారంభం : వైఎస్‌ఆర్‌టీపీ నేత తూడి దేవేందర్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వైఎస్‌ఆర్ పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి చెప్పారు. అందుకే తమ పార్టీ పాదయాత్రకు ప్రజల ఆదరణ పెరుగుతున్నదన్నారు. ఈనెల 28 నుంచి సత్తుపల్లి నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభమవుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైఎస్ షర్మిలపై మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్ కుటుంబమంటే ప్రజలకు ఒక నమ్మకమనీ, వారిది త్యాగాల కుటుంబమన్నారు. సీఎం కేసీఆర్‌ది భోగాల కుటుంబం అని విమర్శించారు. తెలంగాణకు వీసా తీసుకుని రావాలా అని వైఎస్సార్ అన్న మాటలు వక్రీకరిస్తున్నారనీ, కేసీఆర్ కుటుంబం నుంచి వీసా తీసుకుని రావాలా? అంటూ ఆయన అన్నారని గుర్తు చేశారు. నిరంజన్‌రెడ్డి పంచె కట్టినంత మాత్రాన రైతు అయిపోడనీ, వైఎస్సార్ కుటుంబానికి మీ లెక్క రాత్రికి రాత్రి పదవులు రాలేదని గుర్తు చేశారు. రైతులు పండించిన వడ్లు ఎందుకు కొంటలేరో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శిం చారు. ప్రజలకు మేలు చేసే వాళ్ళే ఆదరణ పొందు తారని తెలిపారు. ఫలనా కులం వాళ్ళు మాత్రమే రాజకీయం చేయాలని లేదన్నారు. రేవంత్ నామిని పీసీసీ అని, కొంత మంది నామిని కోసం ఆయనను అధ్యక్షుడిగా నియమించారని విమర్శించారు.