Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీదే ఫ్యామిలీ ప్యాక్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 28,2022

బీజేపీదే ఫ్యామిలీ ప్యాక్‌

- దేశంతో వ్యాపారం చేస్తున్న నలుగురు గుజరాతీ బేరగాళ్లు
- గంగలో శవాలు తేలడమే మోడీ గొప్పతనమా?
- 111జీవో రద్దు చేస్తాం.. ఐటీ సంస్థలు పెట్టండి
- మీడియా సమావేశంలో పీయూసీ చైర్మెన్‌ ఎ.జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఫ్యామిలీ రాజకీయాల చరిత్ర బీజేపీదేనని, మోడీ మాటలు వింటే గురివింద సామెత గుర్తుకు వస్తున్నదని పీయూసీ చైర్మెన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ నుంచి గల్లీ వరకూ బీజేపీలో కుటుంబ పెత్తనమే సాగుతున్నదని చెబుతూ.. అనురాగ్‌ ఠాకూర్‌, పీయూష్‌ గోయల్‌, ధర్మేందర్‌ ప్రధాన్‌, వసుంధర రాజే, పంకజ్‌ సింగ్‌, లడ్డా బహుగుణ తదితర నాయకుల కుటుంబాల నేతల పేర్లను ప్రస్తావించారు. బాల్‌, బ్యాట్‌ పట్టుకోవడం చేతకాని అమిత్‌షా కొడుకు జరుషా బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యా రని ప్రశ్నించారు. యూపీ, మహారాష్ట్ర, హర్యానా, ఏపీ, తదితర రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తుపెట్టు కోలేదా? అని నిలదీశారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం సాధించిన తెలంగాణ గాంధీ కేసీఆర్‌ అని కొనియాడారు. హరీష్‌ రావు, కేటీఆర్‌, కవిత, సంతోష్‌ రావు ఉద్యమకారులని చెప్పారు. అలాంటి వారు ప్రజల ఆశీస్సులతో పదవులు నిర్వహిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. మోడీ ఒక యాక్టర్‌, స్టంట్‌ మాస్టర్‌ అని విమర్శించారు. ఒక్క కేసీఆర్‌ మాత్రమే కాదు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, వెస్ట్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులు తనకు ఎందుకు స్వాగతం పలకడం లేదనే విషయాన్ని మోడీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. తెలంగాణను ఐటీ హబ్‌గా మారుస్తామంటే ఎవరొద్దన్నారు? అని ప్రశ్నించారు. అవసరమైతే 111 జీవో ను కూడా ఎత్తేస్తామనీ, ఆ భూముల్లో ఐటీ సంస్థలు పెట్టండి అని సవాల్‌ విసిరారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలేమయ్యా యనీ, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న16 లక్షల ఉద్యోగ నియామకాలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అంటే భారతీయ జగడాల పార్టీ అనీ, మూఢ నమ్మ కాలకు ప్రతీక అని విమర్శించారు. అది కిల్లర్స్‌,సెల్లర్స్‌ పార్టీ అని ఆరోపించారు. నలుగురు గుజరాతీ బేరగాళ్లు ఇండి యాను వ్యాపార వస్తువుగా చేశారనీ, అందులో మోడీ, అమిత్‌షాలు అమ్మేటోళ్లయితే..అంబానీ, అదానీ కొనేటోళ్లు అయ్యారని విమర్శించారు. మేకిన్‌ ఇండియా ఫేక్‌ ఇండి యాగా, డ్రీమిండియా పూరిండియాగా, టీమిండియా బ్లేమిండియాగా మారడానికి కారణం మోడీనేనన్నారు. తెలంగాణ కోసం ఏ బీజేపీ నేత ప్రాణ త్యాగం చేశారో చెప్పా లని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ మాట్లాడు తూ.. కుటుంబ రాజకీయాల గురించి మోడీ మాట్లాడటం సిగ్గు చేటనీ, ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. దావోస్‌లో కేటీఆర్‌ భారత్‌, తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచుతున్నారన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత ను కత్తులతో నృత్యం చేయించడమే ఉన్నత శిఖరాలను తీసుకెళ్లడమా? మోడీ అని ప్రశ్నించారు. కరోనా సమయం లో గంగా నది లో శవాలు తేలేలా చేయడం మోడీ గొప్పదనమా అని నిలదీశారు. ప్రజల్లో విద్వేషపు విష బీజాలు నాటుతోంది బీజేపీనేనని విమర్శించారు. విదేశాల నుంచి 10 శాతం బొగ్గు దిగుమతి చేసుకోవాలని పవర్‌ ప్లాంట్‌లకు ఆంక్షలు పెట్టడం ఆదానీ కోసమే కాదా? అని ప్రశ్నించారు. మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే బీజేపీ నేతలు, మోడీ వాటి ప్రారంభానికి ఎందుకు వచ్చారని అడిగారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ..మోడీ తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేలా మాట్లాడారన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ లో ఉగ్రవాదులుగా వ్యవహరిస్తున్నారనీ, వారిని ప్రజలే వెలి వేస్తారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. తెలంగాణపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి ప్రధాని మోడీ అని విమర్శించారు. బీజేపీకి మతపర ఎజెండా తప్ప మరోటి లేదని విమర్శించారు. మూఢనమ్మకాలను ప్రచారం చేసే వ్యక్తి తాను టెక్నాలజీని నమ్ముతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశానికి సరిపడా కరెంటు, సాగునీరు అందించడానికి కేసీఆర్‌ దగ్గర స్పష్టమైన విజన్‌ ఉందనీ, అందుకే బీజేపీ నేతలు భయపడుతున్నారని చెప్పారు. ఓటుకు నోటు దొంగ రేవంత్‌ పిచ్చి ప్రేలాపనలను జనం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ లేదని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.