Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సురవరం 125వ జయంతి సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ భాషా సాహిత్యానికి విశిష్ట చరిత్ర ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి, ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సంయుక్తంగా సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి' సందర్భంగా 'సురవరం ప్రతాపరెడ్డి ఈ తరానికి చెరగని స్ఫూర్తి' అన్న అంశంపై శనివారం జాతీయ సదస్సు నిర్వహించాయి. వాస్తవిక దృక్పథంతో రచనలు చేసిన ప్రముఖుల్లో సురవరం ప్రతాపరెడ్డి ప్రథములనీ, ఆయన సాహిత్య సేవలను వక్తలు కొనియాడారు. ప్రతాపరెడ్డి స్థాపించిన గ్రంథాలయాలు సామాజిక చైతన్యానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. గోల్కొండ పత్రిక ద్వారా ఎన్నో అంశాలు వెలికి తీశారని చెప్పారు. తెలంగాణ భాషా సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన సాహితీ వైతాళికుడు సురవరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాల యాల సంస్థ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ టి కిషన్‌రావు, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మెన్ కష్ణమోహన్, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ డిఎస్‌ఆర్ రాజేందర్‌సింగ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ తూర్పు మల్లారెడ్డి, ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం, కాలేజీ ప్రిన్సిపాల్ బి రాజేంద్రకుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎం వాణి, కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు జలంధర్‌రెడ్డి, ఇతర సిబ్బంది, సురవరం ఉమారుడు కృష్ణవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.