Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీసీ గురుకులాల్లో చదువుకునే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తే ప్రపంచస్థాయికి ఎదుగుతారని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సోసైటీ ఆధ్యర్వంలో నిర్వహించిన విద్యార్థుల రాష్ట్ర స్థాయి వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకత ఇలాంటి శిక్షణా శిబిరాల వల్ల వెలుగులోకి వస్తుందనీ, చదువుతోపాటు కళల్లోనూ రాణిస్తారని చెప్పారు.