Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హంటింగ్టన్ అనే వ్యాధి బారిన పడిన రోగులు, వారి కుటుంబ సభ్యులకు టీఎస్‌ఆర్టీసీ అండగా నిలుస్తుందని ఆ సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్లు బాజిరెడ్డి గోవర్థన్, వీసీ సజ్జనార్ తెలిపారు. వంశపారంపర్యంగా సంక్రమించే ఈ జెనిటిక్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ వ్యాధిగ్రస్తులకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం బస్‌భవన్‌లో హంటింగ్టన్ డిసీజ్ సొసైటీ ఆఫ్ ఇండియా (హెచ్.డి.ఎస్.ఐ) నిర్వహణలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నా మన్నారు. ఆరోజు బస్‌భవన్‌లో నీలం, ఊదారంగు లైట్లను వెలిగించడం ద్వారా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తామని తెలిపారు.