Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన పలువురు నేతలు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు రవిచంద్ర చేత ప్రమాణం చేయించారు. అనంతరం రవిచంద్రను పలువురు నేతలు అభినందించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నాయకుడు కె.కేశవరావు, లోకసభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు వాసుదేవ రెడ్డి, నాగూర్ల వెంకన్న, ఎర్రోళ్ల శ్రీనివాస్ రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం వారంతా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వద్దిరాజు రవిచంద్రకు మంచి అవకాశం కల్పించారన్నారు. పార్లమెంటులో రవిచంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల గొంతుక అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.