Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక రాష్ట్రంలో సూర్యాపేట వాసులు మృతి
నవతెలంగాన-సూర్యాపేట
సంతోషంగా విహార యాత్రకు వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం ఏర్పడింది. కర్ణాటకలోని మదికేరి వద్ద కోటే అబ్బి జలపాతంలో నీట మునిగి సూర్యాపేట జిల్లాకు చెందిన ముగ్గురు మృతిచెందారు. తెలంగాణకు చెందిన 16 మంది బంధుమిత్రులు కర్ణాటకకు విహార యాత్రకు వెళ్లారు. కుశాలనగర్‌లోని ప్రయివేటు హోమ్‌స్టేలో బస చేసిన వారు ఆదివారం కోటే అబ్బి జలపాతం చూసేందుకు వెళ్లారు. సరదాగా నీటిలో దిగిన ముగ్గురు పర్యాటకులు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వారిని రక్షించడం అసాధ్యంగా మారింది. మృ తులు సూర్యాపేటకు చెందిన కలకోట నర్సయ్య, వెంకన్న కుటుంబాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని కలకోట శ్యామ్(38), కలకోట శ్రీహర్ష(18), కలకోట షాహీంద్ర (16)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది చివరకు ముగ్గురి మృతదేహాలనుA బయటకు తీశారు. అప్పటి వరకు సంతోషంగా తమ మధ్య ఉన్న ఆత్మీయులు విగత జీవులుగా మారడంతో బంధుమిత్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలు ఇంకా సూర్యాపేటకు రాలేదు.