Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ బిల్లుల విడుదల కోసం పోరాటం : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సర్పంచ్‌ల హక్కుల కోసం త్వరలో మౌన దీక్ష చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ ప్రకటించారు. పెండింగ్ బిల్లుల విడుదల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం సర్పంచ్‌లకు మూడు పేజీల బహిరంగ లేఖ విడుదల చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 73,74 షెడ్యూల్స్‌కు తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. గ్రామాలు స్వశక్తితో అభివద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్‌లు చేసే ఆందోళనలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. సర్పంచ్‌లపై జిల్లా అధికారులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నదని విమర్శించారు.2014లో టీఆర్‌ఎస్ పార్టీ ''గ్రామీణాభివృద్ధి -పంచాయతీ రాజ్ వ్యవస్థ'' అనే అంశం కింద ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చిందన్నారు. సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.