Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలించిన సి.ఎస్. సోమేశ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పూర్తి డ్రెస్ రిహార్సల్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జరగనున్న ఈ వేడుకలకు సంబంధించిన పరేడ్‌ను ఆయన వీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ రెండున పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు.