Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అక్రమ అరెస్టులు, కేసులతో ఉద్యమాలను ఆపలేరని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఎంత నిర్బంధం విధింంచినా నిరంతరం పేదలపక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేసింది. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వేలాది మంది ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి, ఎస్ వీరయ్య, డిజి నరసింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటూ హన్మకొండ కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావులను అక్రమంగా అరెస్టుచేసి రాయపర్తి పోలీస్ స్టేషన్‌కు అక్కడి నుండి మన్సూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని పేర్కొన్నారు. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల నాయకులనూ పోలీసులు ఇండ్లల్లోనే నిర్బంధించడంతోపాటు, అరెస్టులు చేశారని విమర్శించారు. ఈ అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ఖండించారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల్లోని ప్రభుత్వ భూమిలో గత నెల రోజులుగా నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. వాటిని బుల్డొజర్లతో కూల్చివేయడమే కాకుండా, వాటిని కాల్చి, నాయకులపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఈ చెరువులపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం పేదలపై మాత్రం తమ ప్రతాపం చూపుతున్నదని విమర్శించారు. ఈ పోరాటానికి మద్దతివ్వాలని ప్రజాసంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజలకు పిలుపునిచ్చారు.