Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ-ములుగు
మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులోని ఫారెస్ట్ కళాశాలలో మైనార్టీ గురుకులాలపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, చైౖర్మెన్ ఏకె ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో గురుకులాలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ సర్కార్ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుండటంతో అధిక సంఖ్యలో విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని తెలిపారు. విద్యార్థులు అధిక మార్కులు తెచ్చుకునేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. కార్పొరేట్‌కు దీటుగా గురుకులాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పారు. ప్రభుత్వం కూడా విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను కల్పించిందన్నారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, ఊరికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.