Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే మే నెలలో ప్రయాణికుల మరియు సరుకు రవాణా రంగాలలో మే నెలలో 11.713 మిలియన్ టన్నుల సరుకు, 21 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసి రికార్డు నెలకొల్పింది. సరుకుల రవాణాతో రూ.1,067.57 కోట్లు, ప్రయాణికుల ద్వారా రూ.423.98 కోట్లు ఒక నెలలో సంపాదించి మరో రికార్డు సృష్టించింది. ఈ మేరకు గురువారం దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. మే నెలలో 66 ప్రత్యేక రైళ్లను 266 ట్రిప్పులు తిప్పి 2.65 లక్షల మందికి రవాణా సౌకర్యం కల్పించింది. డిమాండ్‌ను బట్టి అదనంగా 1,533 కోచ్‌ల ఏర్పాటుతో 1,14,835 మందికి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. సరుకురవాణాలో అత్యధింగా 6.037 మెట్రిక్ టన్నుల బొగ్గు, 3.147 మెట్రిక్ టన్నుల సిమెంట్, 0.719 మెట్రిక్ టన్నుల ఎరువులు, 0.558 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల లోడింగ్ జరిగింది. మెరుగైన ఆదాయ సముపార్జనకు కృషి చేసిన ఆపరేటింగ్, కమర్షియల్ సిబ్బందిని ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌ఛార్జి) అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.