Authorization
Fri May 16, 2025 05:24:58 pm
- రూ.300 ప్రత్యేక దర్శనం
- రెండ్రోజుల ముందు బుక్ చేసుకోవచ్చు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణీకులకు నేరుగా ఆర్టీసీనే దర్శనం టిక్కెట్లు అందిస్తుందని ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు టీటీడీతో అవగాహన కుదుర్చుకున్నామన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు రోజువారీ 1000 టిక్కెట్లను జారీ చేయనుందని చెప్పారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను బస్సులో ప్రయాణించే రెండ్రోజుల మందు రిజర్వు చేసుకోవల్సి ఉంటుందని చెప్పారు. తక్షణం ఈ విధానం అమలుల్లోకి వచ్చేలా టీటీడీ అనుమతినిచ్చిందని తెలిపారు. నిర్ణీత కోటా ప్రకారం ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రెండ్రోజుల ముందుగానే బుకింగ్‌లు చేసుకోవాలని చెప్పారు. అలాగే ప్రయాణీకులు తప్పనిసరిగా రెండు డోస్‌ల టీకా సర్టిఫికేట్ లేదా దర్శనానికి 72 గంటలలోపు పొందిన కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని వివరించారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రిలిమ్స్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం
యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్లు బాజిరెడ్డి గోవర్థన్, వీసీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం పలు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను చూపి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వివరించారు.