Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాయనున్న అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకుగానూ, వారిని ప్రోత్సాహించేందుకు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) తెలంగాణ కమిటీ నిర్వహించిన ఆన్‌లైన్ మోడల్ టెట్ పరీక్షకు భారీ స్పందన వచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లోని నారాయణగూడలోని యూనియన్ కార్యాలయంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి పరీక్షా పత్రాన్ని ఆన్‌లైన్‌లో చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16581 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.