Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దార్శనిక ఆలోచనల మేరకు తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన ఊరు-మనచరిత్ర' కార్యక్రమానికి విస్తృత ఆచరణ రూపం ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే సోమవారం కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్‌తో అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని డిగ్రీ విద్యార్థులతో వారివారి గ్రామాల చరిత్రను ఆ ఊరి విద్యార్థుల చేతులతో రాయించేందుకు సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అన్ని డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, తెలుగు చరిత్ర శాఖల విభాగాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించనున్నారు. గ్రామ నామాల చరిత్ర దగ్గర నుంచి నేటి పల్లె, పట్టణ ప్రగతి వరకు సంపూర్ణమైన సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. గ్రామంలోని దేవాలయాలు, చర్చీలు, మసీదులు అందుకు సంబంధించిన చరిత్రను రాస్తారు. గ్రామంలోని వృక్ష సంపద, వందల ఏండ్లనాటి చెట్లను, పుట్టలను, గుట్టలను అద్భుతమైన పర్యావరణాన్ని సౌందర్యాన్ని ఇందులో వివరిస్తారు. గ్రామంలో ఉన్న జలసంపద, చెరువులు, కాలువలు, నదులు, ఏరులను అక్షరీకరిస్తారు. ఆ ఊర్లలో ఉండే పంటల నుంచి పండ్లతోటల వరకు అన్ని విషయాలనూ వివరిస్తారు. ఈ ఎనిమిదేండ్లలో జరిగిన అభివృద్ధిని భవిష్యత్ తరాలు విద్యార్థులు అందిస్తారు. వారు వర్తమాన చరిత్రకారులుగా మారతారు.