Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రిలో లేకనే బయటికి రాస్తున్నాం...
- తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కోసం ఇండెంట్ పెడుతున్నా పట్టించుకోవడం లేదని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (టీ-జూడా) విమర్శించింది. ప్రభుత్వాస్పత్రుల్లో లోపాలపై తెలిసిన మంత్రి హరీశ్ రావు వ్యవహరిస్తున్న తీరుపై వారు అసంత ృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీ జూడా సలహాదారు డాక్టర్ రాజీవ్, మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజరు, టి జూడా అధ్యక్షులు డాక్టర్ విష్ణు, ఉస్మానియా మెడికల్ కాలేజీ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ ప్రతిభా లక్ష్మి, మెడికల్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ బొంగు రమేశ్, హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్‌ఆర్ డీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.శ్రీనివాస్, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంపత్ మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. ఆయా ఆస్పత్రుల్లో మందులు లేకపోవడం వల్లే బయటికి రాయాల్సి వస్తున్నదని వివరించారు. మందులు అందుబాటులో ఉన్నాయా? లేదా? అని చూసుకోవడం డాక్టర్ల పని కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సర్కారు దవాఖానాల్లో చికిత్స తీసుకుంటేనే వైద్యులను ప్రశ్నించే అర్హత ఉంటుందని చెప్పారు.
ఏ వైద్యుడిని సస్పెండ్ చేయలేదు: డీఎమ్‌ఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి
ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరిని ఏ వైద్యుడిని సస్పెండ్ చేయలేదని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయొద్దని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా మందులున్నాయని తెలిపారు. ఇండెంట్ ఉన్న ఔషధాలను కూడా కొంత మంది వైద్యులు బయటకు రాస్తున్నారనీ, ఒక వేళ అవసరమైన మందులు లేకపోతే కొనుగోలు కోసం సూపరింటెండెంట్ వద్ద నిధులు ఉంచామని చెప్పారు. కొత్తగా సవరించిన రూల్ ప్రకారం సీనియర్ రెసిడెండ్‌గా చేసిన డాక్టర్‌లు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామకానికి అర్హులని తెలిపారు. కొత్త నియమాలు నాన్ టీచింగ్ నుంచి టీచింగ్ వేపు వెళ్లే వారికి ఈ రూల్స్ వర్తిస్తాయనీ, కన్సల్టేషన్ ప్రాక్టీస్, నర్సింగ్ హౌమ్‌లో ,ఆసుపత్రులు పెట్టడానికి అవకాశం లేదన్నారు.