Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మ, నవీన్ జిందాల్‌లను వెంటనే అరెస్టు చేయాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మత విద్వేష వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మతవిశ్వాసాలను, నమ్మకాలను దుర్వినియోగం చేయడం సరికాదని తెలిపారు.బీజేపీ నేతలు ఒకరిని మించి ఒకరు మతవిద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో పోటీ పడుతున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు మాట్లాడుతూ ''మసీదులను తవ్వితే శవాలు బయట పెడితే మీవీ.., శివాలు బయటపడితే మావి'' అంటూ విద్వేష వ్యాఖ్యలు చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయని తెలిపారు. 57 అరబిక్ దేశాలు తమ నిరసన తెలియజేశాయని పేర్కొన్నారు.