Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల సివిల్ సర్వీసెస్ కి ఎంపికైన ఇంజనీర్లను పలువురు కొనియాడారు.బుధవారం ఇంజనీర్స్ ఇన్సిట్యుట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఖైరతబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో వారిని సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వారు పాలనా వ్యవహారాల్లో చురుగ్గా ఉంటారని తెలిపారు. జీవితంలో మరింత ఉన్నతంగా ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివద్ధి సంస్థ చైర్మెన్ వి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సివిల్స్ లో విజయం సాధించిన ఇంజనీర్లు చైతన్య, సాస్య, శ్రీధర్, అనన్యప్రియ, పవిత్ర, సమ్రాన్ రాజ్ సన్మానాన్ని అందుకున్నారు.