Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్సిడీతో ఇస్తాం : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బీ వినోద్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉద్యోగార్థుల పోటీ పరీక్షల్లో ఉపయోగపడేలా 'తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2022' పుస్తకాన్ని ముద్రించి, సబ్సిడీతో విద్యార్థులకు అందచేస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, సంచాలకులు ఎస్‌కే మీరా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 తో పాటు ఇతర శాఖలలో నియామకాల కోసం ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు జారీ చేస్తున్నదనీ, ఆయా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తెలంగాణ సామాజిక ఆర్ధిక అంశాలపై పట్టుకలిగి ఉండాలని ఆయన చెప్పారు. అలాంటి స్టడీ మెటీరియల్‌తో వారికోసం 300 పేజీలతో 'తెలంగాణ సామాజిక ఆర్ధిక ముఖచిత్రం -2022' పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రచురించిన ఈ పుస్తకాన్ని బి. వినోద్ కుమార్ ఆవిష్కరించారు. రూ.100 సబ్సిడీ ఇస్తూ ఈ పుస్తకాన్ని ప్రస్తుతం రూ. 150 లకు విక్రయిస్తున్నామన్నారు. సమగ్ర వివరాలతో మల్టీ కలర్‌లో ఆకర్షణీయంగా ఉన్న ఈ పుస్తకం అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలలో లభిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీసు ఎదురుగా ఉన్న ప్రణాళిక శాఖ ''గణాంక భవన్'' లో కూడా ఈ పుస్తకం దొరుకుతుందని వివరించారు. ప్రయివేటు బుక్ స్టాల్స్ లో ఈ పుస్తకమును ఉంచలేదన్నారు. ఇతర వివరాలకు రాష్ట్ర ప్రణాళిక విభాగం గణాంక అధికారి జగన్ (ఫోన్ నెంబర్ 91826-07890), ఉప గణాంక అధికారి శ్రీనివాస్ (89789-00832) లను సంప్రదించాలని సూచించారు.