Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశం ఈ నెల 15న మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్, హిమాయత్‌నగర్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరుగనున్నది. ఈ సమావేశంలో ఆ సంఘం జాతీయ సమన్వయ ప్రధాన కార్యదర్శి పల్లబ్ సేన్ గుప్తా, జాతీయ అధ్యక్షులు కె.యాదవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగిస్తారని రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.