Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యాశాఖకు టిప్స్ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీ కరణకు సంబంధించిన జాబితాను ఈనెల 12వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వా నికి పంపకుంటే మెరుపు ఉద్యమం చేపడతామని ఇంటర్ విద్యా శాఖను తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి (టిప్స్) హెచ్చరించింది. ఈ మేరకు టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త మైలారం జంగయ్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ బేఖా తరు చేస్తున్నారని విమర్శించారు. ఇంటర్మీడియట్ బోర్డ్, కమిషనర్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరిపించాలని డిమాండ్ చేశారు. గత 20 ఏండ్లకుపైగా పనిచేస్తున్న కాంట్రా క్ట్ ఉద్యోగులు, అధ్యాపకుల సర్వీసు లను క్రమబద్ధీకరిస్తామంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు.
అందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఆర్థిక శాఖ, జీఏడీ, విద్యాశాఖలు కాం ట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమ బద్ధీకరణకు కావాల్సిన వివరాలను అడిగాయని తెలిపారు. కానీ అధికారు లు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకో కుండా జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో లేని సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శి ంచారు. మంజూరైన, మంజూరు కాని పోస్టులంటూ గందరగోళం సృష్టిస్తు న్నారని పేర్కొన్నారు. అవినీతికి తెర లేపి కాంట్రాక్టు అధ్యాపకుల జీవితా లతో చెలగాటమాడుతున్నారని వివరి ంచారు. ఇప్పటివరకు క్రమబద్ధీకరణ జాబితాలను రూపొందించి ప్రభుత్వా నికి పంపకుండా సీఎం ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని కావాలనే కొందరు బద నాం చేస్తున్నారని తెలిపారు. ఈ విష యాలను విద్యాశాఖ మంత్రి, ఉన్నతా ధికారులు గమనించాలని కోరారు. ఈనెల 12వ తేదీ లోపు కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితాను ప్రభుత్వానికి పంపకుంటే ఇతర సం ఘాలతో చర్చించి మెరుపు ఉద్యమ కా ర్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిం చారు.