Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు బ్యాంక్‌ల ఖాతాదారుల చేరువ కార్యక్రమం
హైదరాబాద్ : పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు సంయుక్తంగా తమ ఖాతాదారుల కోసం ప్రత్యేక రుణాల చేరువ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఖాతాదారుల కోసం బుధవారం మారేడుపల్లిలో ఈ ప్రోగ్రాంను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రవి కుమార్, ఎస్బీఐ హైదరాబాద్ జనరల్ మేనేజర్ దేబాషిష్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమాజంలోని పలు రంగాలకు రుణాలను చేరువ చేయాలని ముఖ్య అతిథులు సూచించారు. ఈ సందర్బంగా ఖాతాదారులకు రుణాల జారీ పత్రాలను అందజేశారు. పలు పథకాల్లో అర్హులైన రుణ గ్రహీతలకు రూ.222.23 కోట్ల విలువ చేసే చెక్కు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమానికి ఎస్బీఐ డీజీఎం సత్య నారాయణ పనిగ్రహి, ఐఓబీ డీజీఎం కౌస్తు మజుమ్‌దార్, ఇండియన్ బ్యాంక్ డీజీఎం చంద్ర ప్రకాశ్, కెనరా బ్యాంక్ డీజీఎం ఎఎస్ అశోక్ కుమార్ తదితరులు హాజరయ్యారు.