Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖను దాటుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ నిర్వహించిన మహిళా దర్బార్ దేనికని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్‌ను దుర్వినియోగం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఎవరైనా వినతి పత్రాలిస్తే స్వీకరించి ప్రభుత్వానికి పంపవచ్చన్నారు. ఏ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ తటస్థ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ మేరకు వారి ప్రవర్తన ఉండాలని గవర్నర్‌కు సూచించారు. ఒకవైపు బీజేపీ రాష్ట్రంలో రాజకీయ దాడి పెంచిందనీ, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి అజ్యం పోసేలా ఉందని విమర్శించారు. మైనర్లను పబ్‌లోకి అను మతించటం చట్టరీత్యా నేరమన్నారు. పబ్‌ను సీజ్ చేసి, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.