Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'స్టార్టప్' పథకాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతీయ రైల్వేల నిర్వహణ, సామర్థ్యం, భద్రత, అభివద్ధికి సాంకేతికతను వినియోగిస్తూ నూతన ఆవిష్కరణలతో వచ్చే యువతరానికి ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చి ప్రోత్సహిస్తామని కేంద్ర రైల్వే, కమ్యునికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సోమవారంనాడాయన ఢిల్లీలోని రైల్ భవన్‌లో 'రైల్వేల కోసం స్టార్ట్‌ప్స్' పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ రైల్వేలో సాంకేతికను అనుసంధానించడంపై సుదీర్ఘంగా జరుగుతున్న చర్చల ఫలితంగా వినూత్న విధానాన్ని ప్రారంభించామన్నారు. రైల్వేలతో అనుసంధానం పొందే స్టార్ట్‌ప్‌లకు దీని ద్వారా ఆర్థిక సహకారం లభిస్తుందన్నారు. నూతన ఆవిష్కకర్తలకు సమాన భాగస్వామ్యం పద్థతిలో రూ. 1.5 కోట్ల వరకు గ్రాంట్ ఇస్తామన్నారు. 11 అంశాల్లో నూతన ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.