Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీ బెదిరింపులకు భయపడం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 14,2022

బీజేపీ బెదిరింపులకు భయపడం

- స్వాతంత్య్రం కోసం యావదాస్తిని ఇచ్చిన రాహుల్‌ గాంధీ కుటుంబం
- ఈడీ బెదిరింపులకు భయపడేది లేదు : కాంగ్రెస్‌ నిరసన ర్యాలీలో రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని అడ్డుపెట్టుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ రాహుల్‌ గాంధీ కుటుంబాన్ని బెదిరింపజూస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇలాంటి బెదిరింపులకు కాంగ్రెస్‌ పార్టీ భయపడబోదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు రాహుల్‌ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఈడీ కార్యాలయం ముందు దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాహుల్‌ గాంధీ కుటుంబం దేశ స్వాతంత్య్రం కోసం చేసిన త్యాగాలు, బీజేపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బ్యానర్లు, ప్లకార్డులతో ర్యాలీ కొనసాగింది. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పాత సచివాలయం, ఆదర్శ్‌నగర్‌ మీదుగా ఈడీ కార్యాలయానికి ప్రదర్శన చేరుకుంది. ఈడీ స్వతంత్ర సంస్థగా కాకుండా అధికార పార్టీ తొత్తుగా మారి ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. వేలాది మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల రాకతో గన్‌ పార్కు నుంచి బషీర్‌బాగ్‌ చౌరస్తా వైపు వెళ్లే రహదారి నిండిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ జెండాలు, నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.
ఆ అవసరం గాంధీ కుటుంబానికి లేదు :రవంత్‌ రెడ్డి
           ర్యాలీని ఉద్దేశించి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ అవినీతి చేయాల్సిన అవసరం రాహుల్‌ గాంధీ కుటుంబానికి లేదని తెలిపారు. రాహుల్‌ పిలుపిస్తే కాంగ్రెస్‌ కార్యకర్తలు 24 గంటల్లో రూ.ఐదు వేల కోట్లు సేకరిస్తారని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీ గొంతుక వినిపించేందుకు పుట్టిన నేషనల్‌ హెరాల్ట్‌ పత్రిక అప్పుల్లో కూరుకుపోతే తిరిగి నడపడానికి రాహుల్‌ నడుం బిగించారని చెప్పారు. ఆ పత్రిక బీజేపీ అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంటే అందులో అక్రమాలు జరిగాయని ఈడీ నోటీసులిచ్చిందని తెలిపారు. 2015లోనే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అలాంటిదేమి జరగలేదని అదే సంస్థ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత మోడీ సర్కార్‌ ఈ కేసును తిరిగి తెరిచిందని వివరించారు. బీజేపీ పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ, ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందనే భయంతోనే ఈడీ నోటీసులిచ్చారని విమర్శించారు. గాంధీ కుటుంబంపై ఈగ వాలినా ఊరుకునేది లేదనీ, సోనియాగాంధీని ఈడీ కార్యాలయానికి రప్పిస్తే చెయ్యి నరికేస్తామని హెచ్చరించారు.
బీజేపీని తరిమికొడతాం...భట్టి
           దేశం నుంచి బీజేపీని తరిమికొడతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. గతంలో ఇందిరాగాంధీని జైలుకు పంపిస్తే ఏమి జరిగిందో తెలుసుకోవాలని బీజేపీకి సూచించారు. రాహుల్‌, సోనియా ఈడీ నోటీసులకు భయపడే వ్యక్తులు కాదని స్పష్టం చేశారు. వారిని కాపాడుకుంటామన్నారు. తమ పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేననీ, మున్ముందు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈస్ట్‌ ఇండియా కంపెనీని తరిమి కొట్టిన పార్టీ ....:శ్రీధర్‌ బాబు
           దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీని బీజేపీ మాదిరిగానే నాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ బెదిరించేందుకు ప్రయత్నించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు గుర్తుచేశారు. అయితే ప్రజాబలంతో ఆ కంపెనీని కాంగ్రెస్‌ పార్టీ తరిమికొట్టి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. అదే స్ఫూర్తితో బీజేపీని గద్దె దించుతామని హెచ్చరించారు. స్వాతంత్ర పోరాటం కోసం యావదాస్తిని ఇచ్చిన గాంధీ కుటుంబానికి అవినీతి చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
           కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈడీతో నోటీసులిప్పించారని విమర్శించారు. బీజేపీ ముక్త భారత్‌ చేసి తీరుతామని హెచ్చరించారు. నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి గీతారెడ్డి ఆ పార్టీ సీనియర్‌ నాయకులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, స్టార్‌ కంపెయినర్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఏఐసీసీ నాయకులు బోసురాజు, చిన్నారెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.