Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సారుపై గరం..గరం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 15,2022

సారుపై గరం..గరం..

- సర్కారుపై తీవ్ర అసంతృప్తిలో గ్రామస్థాయి ఉద్యోగులు
- ఇంకా విధుల్లో తీసుకోకపోవడంతో ఫీల్డు అసిస్టెంట్ల ఆగ్రహం
- హామీల బుట్టదాఖలుతో గుర్రుగా వీఆర్‌ఏలు
- మానసికంగా కుంగిపోయిన వీఆర్వోలు
- పనిభారంతో పంచాయతీ కార్యదర్శుల ఇక్కట్లు
- ప్రజల్ని ప్రభావితం చేయడంలో వీరి పాత్ర కీలకం
- మొదటికే మోసం తెచ్చేలా సర్కారు అనాలోచిత నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
              సంక్షేమరాజ్యమంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు ఆ ఫలాలను ప్రజలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించే క్షేత్రస్థాయి అధికారులపై పడగ విప్పి బుసలుకొడుతున్నది. పల్లెల్లో పదిమందికి ఉపాధి చూపే ఫీల్డు అసిస్టెంట్లను విధుల్లో తీసుకోకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నది. అసెంబ్లీలో వీఆర్‌ఏలకిచ్చిన పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల హామీలు సీఎం కేసీఆర్‌ నోటిమాటకే పరిమితమైపోయాయి. రెవెన్యూ వ్యవస్థలో అణువణువూ తెలిసిన వీఆర్వోలపై అవినీతి ముద్ర వేసి ఆ వ్యవస్థకు రాష్ట్ర సర్కారు మంగళంపాడిన విషయం విదితమే. పంచాయతీ కార్యదర్శులు తీవ్రపనిభారంతో తల్లడిల్లుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సంఖ్యా పరంగా వీరు 45వేల మందే ఉన్నా రాష్ట్ర సర్కారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఈ ఉద్యోగులంతా క్షేత్రస్థాయిలో ప్రజలను ప్రభావితం చేయడంలో కీలకంగా మారే అవకాశముంది. అందుకే, ఈ సెక్షన్‌ ఉద్యోగులపై దృష్టి పెట్టి రాజకీయంగా గ్రామాల్లో పట్టు పెంచుకునే యత్నాల్లో ప్రతిపక్ష పార్టీలున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు వారి విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటే మంచి జరిగే అవకాశముంది. లేకుంటే, టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా నష్టం చేకూరడం ఖాయం.
              గ్రేడ్లుగా విభజంచి వేతనాల్లో కోతలు కోస్తూ తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా తెచ్చిన జీవో నెంబర్‌ 4779ని నిరసిస్తూ ఉపాధి హామీ చట్టం కింద పనిచేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు రెండేండ్ల కింద సమ్మెబాట పట్టారు. ప్రశ్నించే స్వభావాన్ని తట్టుకోలేని రాష్ట్ర సర్కారు..'మాకే ఎదురుతిరుగుతారా?' అంటూ ఫీల్డు అసిస్టెంట్‌ వ్యవస్థనే రద్దు చేస్తున్నట్టు 2020 మార్చిలో ప్రకటించింది. చట్టం రూపుదిద్దుకున్న నాటి నుంచి పనిచేస్తున్న 7500 మంది ఫీల్డు అసిస్టెంట్లు రోడ్డున పడ్డారు. వీరిలో 7,300 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతుల వారే ఉన్నారు. ఆనాటి నుంచి తమ డిమాండ్ల కోసం రెండేండ్లపాటు నిరంతరాయంగా పోరాడారు. సంఖ్యాబలంగా తక్కువే ఉన్నప్పటికీ తమ పోరాటతత్వాన్ని ఎన్నడూ వీడలేదు. మూడుసార్లు చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టి సర్కారుకు మూడుచెరువుల నీళ్లు తాగించారు. ఈ క్రమంలో ఉపాధి హామీ కూలీలపై మంచి పట్టున్న వారిలో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరితే ప్రమాదముందనే విషయం సర్కారు దృష్టికి వెళ్లింది. దీంతో 'విధుల్లో తీసుకుంటాం' అని సీఎం కేసీఆర్‌ మార్చి 2022లో ప్రకటించారు. మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌, ఇలా నెలలు గడుస్తున్నాయి.. గ్రామాల్లో ఈ సీజన్‌ ఉపాధి పనులూ అయిపోవచ్చాయి గానీ నేటికీ వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్న పాపాన రాష్ట్ర సర్కారు పోలేదు. ప్రశ్నించేతత్వాన్ని సహించలేని రాజ్యం వారి విషయంలో ఇంకా నాన్చుతూనే ఉన్నది.
              వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నాటికి 5,088 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని భూముల వివరాలు, లొసుగులన్నీ తెలిసింది వీఆర్వోలకే. వీరికి ప్రజలతోనూ సత్సంబంధాలున్నాయి. వారిని జూనియర్‌ అసిస్టెంట్లుగా పంచాయతీరాజ్‌, వ్యవసాయ, మున్సిపల్‌ శాఖల్లో చేరుస్తారనే చర్చ నడిచినప్పటికీ అతీగతీ లేదు. ఈ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత వీఆర్వోలకు ఓ విధి అంటూ లేకుండా పోయింది. అధికారులు ఏది చెబితే అది చేయడమే వీరి పనిగా మారింది. దీంతో వీఆర్వోలంతా మానసికంగా చాలా మేరకు కుంగిపోయి తీవ్ర ఆక్రోశంతో ఉన్నారు. మొత్తం వీఆర్వోలనే తీసేసినప్పుడు వారికి సహాయకులుగా నియమించిన వీఆర్‌ఏల పరిస్థితి ఏంటనే దానిపై స్పష్టత లేదు. 'వీఆర్‌ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం..పేస్కేలు ఇస్తాం..వారసత్వ ఉద్యోగవకాశాలు కల్పిస్తాం..డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టిస్తాం' అని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ సముద్ర తీరాన ఇసుకమీద రాసిన రాతలాగే మిగిలిపోయింది. సర్కారు ఎత్తుగడలతో మొన్నటిదాకా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు విడివిడి సంఘాలుగా కొట్లాడిన వీఆర్వోలు, వీఆర్‌ఏలు నేడు ఐక్యంగా ముందుకు సాగటం సీఎం కేసీఆర్‌కు మింగుడు పడని అంశమే.
              పంచాయతీ కార్యదర్శుల కష్టాలకడలి మరో రకంగా ఉంది. ఉదయం ఆరు గంటలకే టెన్షన్‌గా ఊరుబాట పట్టి ఏ రాత్రికో ఇంటికి చేరుకుంటున్న దైన్యస్థితి. ఓవైపు ఉన్నధికారులు సవాలక్ష ఆర్డర్లు..రిపోర్టుల మీద రిపోర్టులు ఇవ్వాలంటూ ఆదేశాలు.. తప్పయినా మేం చెప్పినట్టు చేయాల్సిందేనంటూ మరోపక్క క్షేత్రస్థాయిలోని అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వారి పరిస్థితి ముందునుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది. వేతనం పెంచినప్పటికీ మూడేండ్ల ఒప్పందకాలాన్ని నాలుగేండ్లకు పొడిగిస్తూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంపై జూనియర్‌ పంచాయతీరాజ్‌ కార్యద ర్శులు గుర్రుగా ఉన్నారు. పనిఒత్తిళ్లకు తాళలేక, ఎస్‌ఐ, ఇతర ఉద్యోగాలు పొందిన క్రమంలో రాజీనామాలు చేసిన కార్యదర్శుల స్థానంలో కొందర్ని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకున్నారు. అలా తీసుకున్న వారిలో 317 జీఓ పేరుతో రాత్రికిరాత్రే 400 మంది ఔట్‌సోర్సింగ్‌ పంచాయ తీకార్యదర్శులను సర్కారు ఇంటికి సాగనంపింది. వీరంతా ప్రభుత్వంపై ఆక్రోశంతో ఉన్నారు.
రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు ఎఫెక్టే
              క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఆ నలుగురిపై సర్కారు వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ నాలుగు విభాగాల ఉద్యోగులు కలిపితే రాష్ట్రంలో 45 వేలకుపైగా ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున వీరు 400 మంది (హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాలను మినహాయించి)కిపైగా ఉన్నారు. వీరంతా ప్రభుత్వంపై తమకున్న అసంతృప్తితో నియోజకవర్గంలో ఒక్కొక్కరు కనీసం 30 నుంచి 50 మందిని ప్రభావితం చేసినా 12 వేల నుంచి 20 వేల ఓట్లకు ఎఫెక్టు పడే అవకాశం ఉంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీపై సహజంగానే కొంతమేర అసంతృప్తి ఉంది. దీనికి తోడు ఈసారి హోరాహోరిగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అభ్యర్థి అయినా 5 వేల నుంచి 15 వేల ఓట్లతోనే గెలిచే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో ఆ ఉద్యోగుల పాత్ర కీలకం కానున్నదనే చర్చ నడుస్తున్నది. అందుకే ఆ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా పరిష్కరిస్తే దానికి అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.