Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 18 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని టీపీటీఎఫ్ అధ్యక్షులు వై అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి మూత్యాల రవీందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఏపీలో ప్రతినెలా ఏర్పడిన ఖాళీలను ప్రత్యక్ష నియామకాల కోటా 70 శాతం పోగా మిగిలిన 30 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఆనవాయితీ ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భవించాక ఒక్క ఉపాధ్యాయ పోస్టునూ పదోన్నతుల ద్వారా భర్తీ చేయలేదని విమర్శించారు. కోర్టుల్లో ఉన్న పదోన్నతులు, సర్వీసు నిబంధనలకు సంబంధించిన కేసులకు కౌంటర్ ఫైలింగ్ చేయడంలో ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. దీంతో వేలాది మంది ఉపాధ్యాయులు పదోన్నతులకు నోచుకోక ఉద్యోగ విరమణ పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సర్కారు బడుల్లో ఏటా విద్యాప్రమాణాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. 2019-20 విద్యాసంవత్సరం వరకు 15,661 మంది విద్యావాలంటీర్లు పనిచేశారని గుర్తు చేశారు. కరోనా కాలంలో వారిని నియమించలేదని తెలిపారు.