Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ కుటుంబం అక్రమ ఆస్తులను కూడబెట్టిందని ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ధరణి పేరుతో నిధులు,అసైన్డ్, పట్టా భూముల స్వాహా, డ్రగ్స్, గుట్కా, గంజాయి , అక్రమ మద్యం తో కోట్లాది రూపాయలను ఆ కుటుంబం కూడబెట్టుకుందని ఫిర్యాదు చేసినట్టు జడ్సన్ చెప్పారు. సమర్పించిన ఆధారాలను చూసి గవర్నర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. జడ్సన్ వెంట రాష్ట్ర మాజీ స్పెషల్ ప్లీడర్ అడ్వకేట్ శరత్ కుమార్ ఉన్నారు.