Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జనాన్ని గాలికొదిలేసిండ్రు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 17,2022

జనాన్ని గాలికొదిలేసిండ్రు

ఆ మూడు పార్టీల తీరు ఇదే...
ఒకరిపై మరొకరి పైచేయి కోసమే ఆరాటం

- బీజేపీ.. టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ల తీరిది
- ఈ గలాటలో కీలక సమస్యలు పక్కకు
- ఇందుకు భిన్నంగా ప్రజల బాధల్ని భుజానికెత్తుకున్న వామపక్షాలు
- పెట్రో ధరలు, గ్యాస్‌ భారాలు..
- పోడు భూములపై పోరు దాకా ఇదే పంథా

బి.వి.యన్‌.పద్మరాజు
            కేంద్రంలో రెండోసారి గద్దె మీద కూర్చున్న పార్టీ ఒకటి. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి, ముచ్చటగా మూడోసారి పీఠం ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్న పార్టీ మరోటి. పదేళ్లపాటు పవర్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల్లోని లోపాలు, లొసుగులను ఆధారం చేసుకోవటం ద్వారా ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించు కోజూస్తున్న పార్టీ మరోటి. ఆయా పార్టీలేవో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అవే బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు. రాజకీయంగా రోజుకు రెండు, మూడు ప్రకటనలు గుప్పిస్తూ సంచనాలత్మకం కోసం పాకులాడుతున్న ఈ మూడు పార్టీలూ... రాష్ట్రంలోని ప్రజలెదుర్కొం టున్న ప్రధాన సమస్యలను, వారి ఈతి బాధలను పూర్తిగా గాలికొదిలేశాయి. పొలిటి కల్‌గా ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలనే ఏకైక అజెండాతో పూటకో ట్వీట్‌, రోజుకో స్టేట్‌మెంట్‌తో కాలం గడుపుతు న్నాయి. ప్రస్తుతం మారిన పరిణామాల దృష్ట్యా తమ ఇమేజ్‌ను పెంచుకునేందుకు 'రాజకీయ ఆందోళనలు, రాస్తారోకోలు, బంద్‌'లకు సిద్ధమవుతున్నాయి. అంతే తప్ప జనం గురించి ఏ కోశానా పట్టించుకున్న పాపాన పోవటం లేదు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఒకవైపు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచుతూ పోతున్నది. వాటి ధరల నియంత్రణను పూర్తిగా మార్కెట్‌ శక్తులకు అప్పగించటం వల్ల ప్రజలపై విపరీతమైన భారాలు పడుతున్నాయి. బీజేపీ సర్కారు ప్రయివేటీకరణను శరవేగంగా అమలు చేస్తున్నది. దీంతో ప్రస్తుతమున్న రిజర్వేషన్లు మున్ముందు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వ సైతం తానేమీ తక్కువ కాదన్నట్టుగా సెస్‌లు, టోల్‌ రుసుముల పెంపు పేరిట పరోక్షంగా ఆర్టీసీ బస్‌ ఛార్జీలను ఇబ్బడి ముబ్బడిగా పెంచింది. ఇటీవల పెరిగిన కరెంటు ఛార్జీలు సైతం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవిగాక వాహన, భూ రిజిస్ట్రేషన్ల రుసుములు ఈ మధయ విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ ఉదాశీనత వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. కూరగాయలు, పండ్లు మొదలు అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలన్న సోయి అటు బీజేపీకిగానీ, ఇటు టీఆర్‌ఎస్‌కు గానీ లేకపోవటం గమనార్హం. సమస్యల నుంచి ప్రజలను మళ్లించటానికి వీలుగా బీజేపీ రాష్ట్ర నేతలు... మసీదులు, తవ్వకాలు, శివలింగాలు, సమాధులు, గుళ్లు, గోపురాల పేరిట నానా యాగీ చేస్తున్నారు. దీనికి అదనంగా ఆ పార్టీ ఢిల్లీ నేతలు ఇక్కడికొచ్చి 'తెలంగాణలో నిజాం రాజ్యాన్ని భూస్థాపితం చేస్తామనే' రెచ్చగొట్టుడు వ్యాఖ్యల ద్వారా అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఇదే సమయంలో పలు రాజకీయాంశాల్లో మోడీ సర్కార్‌పై పేపర్‌ పులిలా విరుచుకుపడుతున్న గులాబీ పెద్దలు... కీలకాంశాలపై మాత్రం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప నిర్దిష్ట కార్యాచరణకు పూనుకోవటం లేదన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌ సైతం వీటిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యకరమైన అంశం. ఇంతటి కీలకమైన ప్రజా సమస్యలపై పోరాడాలన్న ఆలోచన హస్తం పార్టీకి రాకపోవటమనేది వాటి పరిష్కారం పట్ల దాని చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే ఇదే సమయంలో 'రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు...' ఇవ్వటాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో అనేకానేక ఆందోళనలకు ఆ పార్టీ పిలుపునివ్వటం గమనార్హం. ఆ క్రమంలో అది గురువారం 'చలో హైదరాబాద్‌' పేరిట హడావుడి సృష్టించిన సంగతి తెలిసిందే.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రధానంగా ఉన్నామని చెప్పుకుంటున్న ఆ మూడు పార్టీలూ... ఇలా ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్న తరుణంలో వామపక్షాలు వాటిని భుజానకెత్తుకున్నాయి.. ఇప్పుడు కూడా ఎత్తుకుంటున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు మొదలు విద్యుత్‌, బస్‌ ఛార్జీలపై అవి నికరంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. నిత్యావసర ధరల పెరుగుదలపై నిరసన గళమెత్తాయి. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఇవ్వాలంటూ నినదిస్తున్నాయి. పోడు భూముల సమస్యను పరిష్కరించాలంటూ పట్టుబట్టాయి. తాజాగా వరంగల్‌ జిల్లా జక్కలొద్దిలో పేదల భూ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. గౌరవెల్లి నిర్వాసితుల పక్షాన నిలిచి పోరాడుతున్నాయి. ఇవేగాక రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, విద్యార్థి, మహిళా ఉద్యమాలకు సంఘీభావం తెలుపుతున్నాయి. కుల దురహంకార, మతోన్మాద చర్యలను నిరసిస్తూ ముందుకెళుతున్నాయి. రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ నిజమైన దేశ భక్తులం తామేనని నిరూపించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికైనా మిగతా పార్టీలు వీటిని చూసి నేర్చుకోవాలి. ప్రజా సమస్యలపై అవి దృష్టి సారించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.