Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ ధృవపత్రాలు సృష్టించి వేరొకరి ఇంటి జాగాకు రిజిస్ట్రేషన్
- లబోదిబోమంటూ కోర్టు చుట్టూ తిరిగిన బాధితుడు
- తొమ్మిదేండ్లకు దక్కిన న్యాయం
నవతెలంగాణ-హుస్నాబాద్
నకిలీ ధృవపత్రాలు సృష్టించి వేరొకరి భూమిని కాజేసిన నిందితులకు ఎట్టకేలకు కోర్టు శిక్ష విధించింది. నకిలీ భూమి పత్రాలు, ఓటరు గుర్తింపు కార్డులు తయారు చేసి వేరొకరి ఇంటి స్థలాన్ని కాజేసిన ఇద్దరు ప్రబుద్ధులను జైలుకు పంపింది. తొమ్మిదేండ్ల కింద సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అక్కన్న పేట మండలం జనగామకు చెందిన కొండం రాంరెడ్డి ఇంటి స్థలాన్ని దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న హుస్నాబాద్‌కు చెందిన కందుల మాధ వరెడ్డి, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్‌కు చెందిన గుజ్జి అశోక్ రెడ్డికి రెండేండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం హుస్నాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివరంజని తీర్పు చెప్పారు. దాంతో తొమ్మిదేండ్ల తర్వాత బాధితుడికి న్యాయం దక్కింది. అక్కన్నపేట మం డలం జనగామకు చెందిన కొండం రాంరెడ్డికి హుస్నాబాద్‌లో 121 గజాల ఇంటి స్థలం ఉంది. తెలంగాణ ఏర్పడక ముందు నుంచి ఆయనకు అక్కడ స్థలం ఉంది. ఆ స్థలాన్ని కందుల మాధవరెడ్డి, గుజ్జి అశోక్ రెడ్డి దొంగపత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీన్ని ఆల స్యంగా గుర్తించిన రాంరెడ్డి 2013 జులై 14న హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
అప్పటి ఎస్‌ఐ మహేందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టు 17న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు. తదనంతరం పరి శోధనలో భాగంగా ఇద్దరు నింది తులు తయారు చేసిన దొంగ పత్రాలను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. 2014 సెప్టెంబరు 30న హుస్నాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. బుధ వారం కేసు విచారణకు వచ్చింది.
నేరం రుజువు కావడంతో మాధవరెడ్డి, అశోక్ రెడ్డికి రెండేండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జడ్జి శివరంజని తీర్పు చెప్పారు. ఈ కేసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాస ిక్యూటర్ రవికిరణ్ వాదనలు వినిపిం చారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన అప్పటి ఎస్‌ఐ మహేందర్ రెడ్డి, కోర్టు కాని స్టేబుల్ రవికుమార్‌ను పోలీసు కమిషనర్ శ్వేత అభినందించారు.