Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు నిప్పు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 18,2022

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు నిప్పు

పలు బోగీలు, ఇంజిన్లు దగ్దం
- 'అగ్నిపథ్‌'కు వ్యతిరేకంగా నిరుద్యోగుల నిరసనలు
- పోలీసుల కాల్పులు ఒకరి మృతి, పలువురికి గాయాలు, రైళ్లు రద్దు
- భయంతో పరుగులు తీసిన ప్రయాణీకులు
- చావో రేవో ఇక్కడే-రైలు పట్టాలపై యువకుల బైటాయింపు
నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో/సిటీబ్యూరో
          సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రణరంగాన్ని తలపించింది. రాళ్లు రువ్వడం, రైలింజన్లు, బోగీలకు నిప్పు పెట్టడం, సీసీ కెమేరాల ధ్వంసం, రైల్వే ట్రాక్‌లపైకి ద్విచక్ర వాహనాల్ని విసిరేసి తగులబెట్టడం, పోలీసుల లాఠీచార్జీ, టియర్‌గ్యాస్‌ ప్రయోగం, కాల్పులు, మరణాలు, క్షతగాత్రులు... ఇలా ఎన్ని రకాల విధ్వంసాలు జరగాలో అన్నీ అక్కడ జరిగాయి. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్‌' స్కీంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఉత్తరాదికే పరిమితమైన ఈ ఆందోళనలు అకస్మాత్తుగా దక్షిణాదికీ పాకాయి. దానిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ఉద్యోగార్ధులు ముట్టడించారు. వీరంతా 2021 మార్చిలో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో జరిగిన సైనిక్‌ ర్యాలీ (రిక్రూట్‌మెంట్‌)లో దేహదారుఢ్య పరీక్షలు, మెడికల్‌ టెస్ట్‌లు పాసయినవారే. వీరందరికీ రక్షణ శాఖ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (సిఈఈ) నిర్వహించాల్సి ఉంది. కోవిడ్‌ పేరు చెప్పి దాదాపు 11 సార్లు ఈ పరీక్షల్ని రక్షణశాఖ వాయిదా వేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ స్కీం పేరుతో నాలుగేండ్ల కాలపరిమితితో కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో 2021 మార్చిలో సెలెక్ట్‌ అయిన అభ్యర్థులకు పెట్టాల్సిన కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (సిఈఈ)ను రద్దు చేస్తున్నట్టు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. దాదాపు ఏడాదిన్నర నుంచి సీఈఈ కోసం ఎదురు చూస్తూ, ఇక సెలెక్ట్‌ అయ్యి ఉద్యోగాల్లో చేరతాం అనుకుంటున్న టైంలో అగ్నిపథ్‌ ప్రకటన వెలువడింది. సీఈఈ రద్దుతో వీరందరికీ ఇప్పుడు వయోపరిమితి మించిపోయింది. మరోసారి రిక్రూట్‌ అయ్యే అవకాశాన్ని వీరంతా కోల్పోయారు. ఫలితంగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లాల వారీగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకొని పథకం ప్రకారం ఒకేసారి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై మెరుపుదాడి చేశారు. అగ్నిపథ్‌ స్కీంను రద్దు చేయాలనీ, తమకు సీఈఈ నిర్వహించాలంటూ నినాదాలు చేస్తూ విధ్వంసానికి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో మరింత ఆగ్రహావేశాలకు లోనై రైళ్లకు నిప్పుపెట్టారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో తొలుత రెతీఫైల్‌ బస్టాండ్‌ వద్ద ఓ బస్సు అద్దాలు పగులకొట్టి నిరసనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈలోపు చిలకలగూడ వైపు ఎంట్రన్స్‌ నుంచి ఒక్కసారిగా యువకులు 5 నుంచి 1వ నెంబర్‌ ప్లాట్‌ఫారాల మీదకు పెద్దగా అరుస్తూ, చేతికి అందిన వస్తువుల్ని విసిరేస్తూ వచ్చారు. కొందరు యువకులు పెట్రోల్‌ బాటిళ్లు కూడా వెంట తెచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వాటిని ఆగి ఉన్న రైలు బోగీల్లో చల్లి నిప్పుపెట్టారు. అయితే వారెవరూ ప్రయాణీకుల్ని లక్ష్యంగా చేసుకోలేదు. మూడు రైళ్లలోనూ రైల్వే పార్సిల్‌ బోగీలు, పోస్టల్‌ బోగీలు, రైలు క్యాంటీన్‌ బోగీలు, ఖాళీగా ఉన్న ఏసీ బోగాలనే లక్ష్యంగా చేసుకొని నిప్పంటించారు. ఈ విధ్వంసంతో రైలు ప్రయాణీకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో స్టేషన్‌ బయటకు పరుగులు తీసారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేట గ్రామానికి చెందిన దామెర రాకేశ్‌ (21)కు ఛాతీలో బుల్లెట్‌ దిగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని సోదరి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో పనిచేస్తుంది. మూడేండ్లుగా అతను ఆర్మీలో చేరేందుకు కోచింగ్‌ తీసుకుంటున్నాడు. కాల్పుల్ని నిరసిస్తూ ఆందోళనకారులు చిలకలగూడ రైల్వే గోదాంకు నిప్పుపెట్టారు. దానితో అక్కడి కాపర్‌ వైర్‌ బండిళ్లు తగులబడ్డాయి. అజంతా, ఈస్ట్‌కోస్ట్‌, ఫలక్‌నుమాతో పాటు రిలీఫ్‌ ట్రైన్ల పలు బోగీలకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులు ఇండియన్‌ లవర్స్‌ ఆర్మీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. భారత్‌మాతాకీ జై, ఇండియా జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు రెతీఫౖౖెల్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ఆరు బస్సుల అద్దాలు పగులగొట్టారు.
రైల్వేస్టేషన్‌ ముట్టడికి ముందే ప్లాన్‌
          సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముట్టడికి నిరుద్యోగ యువకులు ముందుగానే ప్లాన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారానే వీరంతా ఒకచోటకు చేరినట్టు తెలుస్తున్నది. రైల్వే స్టేషన్‌ బ్లాక్‌ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈనెల 15న మధ్యాహ్నం 1:50 గంటలకు గ్రూప్‌ క్రియేట్‌ అయ్యింది. అలాగే వరంగల్‌ జిల్లాలో ఓన్లీ పేరుతో మరో గ్రూప్‌తో పాటు, 15న ఉదయం 11:12 గంటలకు మరో గ్రూప్‌ను క్రియేట్‌ చేశారని పోలీసులు గుర్తించారు. గ్రూప్‌లో మొత్తం 2వేల మంది జాయిన్‌ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 9:30 గంటలకల్లా బస్సులు, టాక్సీలు, రైళ్లు, కార్లలో విద్యార్థులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. మరికొందరు రెండు రోజుల ముందే హైదరాబాద్‌కు చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
భారీ బందోబస్తు
          సికింద్రాబాద్‌ ఘటనతో అప్రమత్తమమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. టాస్క్‌ఫోర్సు, రైల్వే, సీఆర్‌పీఎఫ్‌, ఇంటలిజెన్స్‌, సివిల్‌ పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. రైల్వేస్టేషన్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిరసన కారులకు నచ్చజెప్పేందుకు అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, జాయింట్‌ సీపీ రంగనాథ్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావుతోపాటు ఏసీపీలు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. రైల్వే డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ శాండిల్య ఘటనా స్థలికి చేరుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అభ్యర్థులు తేల్చి చెప్పారు. మరోవైపు ధ్వంసమైన రైళ్లను రైల్వే సిబ్బంది ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన ఫ్లాట్‌ఫామ్‌ల్లో మరమ్మత్తులు చేపట్టారు.
రైళ్ళు రద్దు.. దారి మళ్లింపు
          ఆ ఘటనతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్ళించింది. కొన్ని రైళ్లను మౌలాలీ, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి నడపాలని నిర్ణయించింది. 66 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేశారు. మెట్రోరైల్‌ సేవల్ని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.కాజీపేట, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
దశలవారీగా అరెస్టులు
          రైల్వే స్టేషన్‌పై దాడి ఘటనలో పలువురు ఆందోళనకారుల్ని రైల్వే, సివిల్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి 9 గంటల వరకు దశలవారీగా వారిని అరెస్టు చేస్తూనే ఉన్నారు. సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కనిపించిన పలువురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే పోలీసులు పలు సెక్షన్ల క్రింద ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు. వాటిని సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలను పరిరక్షించాలని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దుకాణాలు బంద్‌
          సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. రెతిఫైల్‌తో పాటు ఇతర బస్టాండ్లలోని బస్సు సర్వీసుల్ని ఇతర ప్రాంతాలకు మళ్ళించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.