Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 కోట్ల ఆస్థులు విధ్వంసం : రైల్వే అదనపు డీజీ సందీప్ శాండిల్య
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిది
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారుల దాడి, విధ్వంసం వెనక కుట్ర దాగి ఉన్నదనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నామని రాష్ట్ర రైల్వే పోలీసు విభాగం అదనపు డీజీ సందీప్ శాండిల్య తెలిపారు. దాడి జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను ఆయన పరి శీలించారు. వివరాలను అక్కడి రైల్వే పోలీసు అధి కారులతో పాటు ఇతరులతో మాట్లాడి తెలుసు కున్నారు. రైల్వే ప్రయాణికులను భయభ్రాంతు లకు గురి చేస్తూ ఇష్టమచ్చిన తీరులో ఆస్థుల విధ్వంసానికి పాల్పడటం, రైలు బోగీలు, ఇంజన్ల ను తగలబెట్టటం, పోలీసులపై రాళ్లు రువ్వటం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై దర్యాప్తు సాగుతున్నదనీ, అందులో అ న్ని విషయాలూ బయట పడతాయని తెలిపారు.
డీజీల్ ట్యాంకును తప్పించడానికే ఫైరింగ్?
ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపిన వైనంపై పలు ప్రకటనలు వినిపిస్తు న్నాయి. ఆందోళనకారులు ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌పై మొదట దాడికి పాల్పడ్డారు. అనంతరం అజంత, దర్బంగా ఎక్స్‌ప్రెస్‌లపై దాడికి పాల్పడి బోగీలను దహనం చేశారు. ఈ దశలో మరో గుంపు కాలుతున్న కాగడాలను పట్టుకొని మరో రైలు బోగిపైకి దాడికి వెళ్లడం.. అదే సమయంలో దానికి సమీపంలోనే డీజీల్ ట్యాంకర్ ఉండటంతో పోలీసులు ఆందోళనకు గురయ్యారని తెలిసింది. ఆ పరిస్థితిని నివారిం చటానికే ఆందోళనకారు లపై పోలీసులు నేరుగా కాల్పులు జరిపినట్టు పో లీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే, వారి పై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించకుండా నేరుగా అసలు బుల్లెట్లతో ఫైరింగ్ చేయడమేమిటనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతున్నది.
నిఘా వైఫల్యం
సికింద్రాబాద్ ఘటనలపై ఇంటెలిజెన్స్ అధి కారుల నిఘా వైఫల్యమే కారణమని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఆందోళ నలు చెలరేగే ప్రమాదమున్నదని ఇంటెలిజెన్స్ అధికారులు ముందుగానే ఎందుకు పసిగట్టలేక పోయారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆర్మీ ఉద్యో గార్థులు గత రెండ్రోజులగా వాట్స ప్ గ్రూపులు సృష్టించుకొని దాని ద్వారానే వివిధ జిల్లాల ఆందో ళనకారులను ఏకం చేసి సికింద్రా బాద్ రైల్వే స్టేషన్‌ను టార్గెట్ చేయటాన్ని నిఘా అధికారులు గుర్తించకపోవటం వారి నిష్క్రియా పరత్వాన్ని సూచిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.