Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇంటి పని మనిషికి గుర్తింపేది? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 19,2022

ఇంటి పని మనిషికి గుర్తింపేది?

సామాజిక భద్రత కరువు
- లైంగిక వేధింపులు..అరకొర వేతనాలు ొ అక్కరకు రాని కార్మిక చట్టాలు
- ధరల భారం..బతుకు కష్టం
- ఆదాయం లేక అప్పులతో నెట్టకొస్తున్న గృహ కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
            రాష్ట్రంలో ఇంటి పని చేసుకుంటూ బతుకుతున్న ప్రభ, విజయలక్ష్మి, సద్దార్‌బేగం,సుజాత వంటి ఇంటి పనివారల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇతరుల ఇళ్లు ఊడ్చి, నేల కడిగి, వంటచేసి జీవనం సాగించే ఇంటి పనివారి బతుకంటే ఎలాగుంటుంది? అంటే ఇంటి యజమానుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లు ఉండమంటే ఉండాలి. పొమ్మంటే పోవాలి. ఇచ్చే జీతానికి వెట్టి చేయించేవారు కొందరైతే.. తిట్లు పెట్టి పంపించేవారు ఇంకొందరు. జీతం పెంచమంటే రేపటి నుంచి రావాల్సిన పనిలేదంటూ మొహం మీదే చెప్పేవారు మరికొందరు.
            రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందంటున్నాం. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఎత్తైన అపార్టుమెంట్లు, విశాలమైన ఇండ్లున్నాయి. కానీ.. అదే నగరంలో విస్తారమైన బస్తీలు, మురికివాడలున్నాయి. ఆ వాడల్లో, బస్తీల్లో అద్దె ఇండ్లలో బతుకుతున్న వీరి గురించి ఎవరూ ఎక్కడా ప్రస్తావించరు. ముఖ్యంగా సుమారు ఆరు లక్షలమంది ఇంటి పనివారి జీవితాల గురించి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు.
పేదరికానికి కేరాఫ్‌ వీరే..
            వీరంతా సమాజంలోని పేద వర్గాల నుంచి వచ్చిన దళిత, ముస్లిం, వెనుకబడ్డ తరగతులనుంచి వచ్చిన వారే. గ్రామాల్లో వ్యవసాయం సంక్షోభంలో పడటం, వీరికి సొంత భూమి లేకపోవటం, వ్యవసాయ రంగంలో యంత్రాలు ప్రవేశించటం వల్ల పట్టణాలకు వలసొచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇందులో 99శాతం మహిళలు, బాలికలే. వీరిలో సుమారు 35శాతం మంది వితంతువులే. భర్త నుంచి దూరమైన వారు, ఇతర కుటుంబ సమస్యలతో ఒంటరిగా జీవిస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. వీరి శ్రమ ఇతర రంగాల్లోని కార్మికుల్లాగా బహిరంగంగా కనిపించదు. ఇంటి లోపలే పనిచేయాలి. వీరి కష్టానికి న్యాయమైన విలువ కట్టే పద్దతులు అమల్లో లేవు. ఎలాంటి ఒప్పందం లేకుండానే..అనామత్‌గా నియమితులై శ్రమ చేస్తుంటారు. పెరుగుతున్న ధరలతో సరిపోల్చని వేతనాలతో అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. పేదరికానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్నారు.
ఇదెక్కడి న్యాయం ?
            ఒక ఇంటిలో ఇంటి పనివారిగా చేరాలంటే ముందుగా స్థానిక పోలీసుస్టేషన్‌లో వారి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వారి పేరు, ఇంటి అడ్రస్‌, స్థానికంగా వారికున్న పరిచయాలు, వేలి ముద్రలు, గత చరిత్ర తెలపాల్సి ఉంటుంది. కానీ యజమానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు మాత్రం ఇంటి పనివారికి తెలపరు. ఇదెక్కడి న్యాయం? అంతేకాదు యజమాని ఇంటిలో ఏదైనా వస్తువు పోతే ముందుగా అనుమానించబడే వ్యక్తులు ఇంటి పనివారే. వెంటనే వారిపై 'దొంగ' అనే ముద్ర పడిపోతుంది. ఒక్కోసారి యజమాని చేసే తప్పులను తమపై వేసుకుని, చట్టపరమైన శిక్షలూ అనుభవించిన ఘటనలూ ఉన్నాయి. దీనంతటికీ కారణం వారు అట్టడుగువారు కావడం.. కార్మికులుగా గుర్తింపు లేకపోవడమే.
శ్రమకు గుర్తింపేది ?
            ఇంటి పనివారు ముఖ్యంగా ఇంటిని శుభ్రపరచడం, పాత్రలు కడగడం, వంట, పిల్లల, వృద్ధుల సంరక్షణలాంటి పనులను చేస్తుంటారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కుటుంబపోషణ కోసం పట్టణాలకు వలస వచ్చిన అట్టడుగు వర్గాలకు చెందినవారే అధికం. వారు రోజంతా కష్టపడినా పనికి తగిన గుర్తింపు లేదు. రాష్ట్రంలో సుమారు 12లక్షల మంది ఉంటే..నగరంలోనే సుమారు ఆరు లక్షల మంది ఇంటి పనివారులున్నారు. వీరిలో వారాంతపు సెలవు లేకుండా సుమారు 70శాతం మంది పని చేస్తున్నారని తెలిసింది. వేతనంలో ఏ మాత్రం పెంపు లేకుండా 87.8శాతం ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి.ఇందులో 12.75శాతం మందికి సామాజిక పథకాలు అందటం లేదని చెబుతున్నారు. పని ప్రాంతంలో లైంగిక వేధింపులకు గురవుతున్నవారు 2.8శాతం మంది ఉన్నారని ఒక ప్రయివేటు సర్వే తేల్చింది.ఈ విషయాలపై నోరు విప్పని వారు చాలా మందే ఉంటారని అంచనా.
సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఏది?
            రాష్ట్రంలో అందరూ సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నారనీ, దీంతో రాష్ట్రం బంగారు తెలంగాణగా ప్రసిద్ది చెందిందని పాలకులు పదేపదే చెబుతున్నారు. కానీ..ఇంటి పనివారికి సంక్షేమ పథకాలతోపాటు ఎలాంటి చట్టబద్ద సౌకర్యాలు అందటం లేదు. ఉండటానికి ఇండ్లు లేక కట్టలేని కిరాయిలతో సతమతమవుతున్నారు. వీరికి రెండు పడక గదుల ఇండ్లు ఇస్తామని ఎన్నికలప్పుడు సర్కారు చెప్పిన మాట నీటి మూటగా మిగిలిందని వారు వాపోతున్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రేషన్‌ కార్డులు, ప్రసూతి సౌకర్యాలు, పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, అదనపు పనికి అదనపు వేతనం తదితర కోర్కెలను పరిష్కరించేందుకు సర్కారు కృషి నామమాత్రమేనన్న అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం పట్టించుకోవాలి
            2011లో అంతర్జాతీయ గృహ కార్మికుల రక్షణ కోసం ఐఎల్‌ఓ కన్వెన్షన్‌ సి189/చట్టాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇంటి పనివారి రక్షణ మెరుగు దలకు కృషి చేస్తున్నారు.కానీ..మన రాష్ట్రంలో ఇంటి పనిచేసే మహిళల పరిస్థితి మారలేదు.ఆర్థికంగా వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావటంలేదు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌లాంటి చట్ట బద్ద సౌకర్యాలు అసలే లేవు. కనీసం గుర్తింపు కార్డులైనా ఇవ్వాలనే డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించాలి
- కెఎన్‌ ఆశాలత, కన్వీనర్‌
స్నేహ ఇంటిపనివారల సంఘం(ఐద్వా)

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.