Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టు నేత అభరు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అగ్నిపథ్ పథకం పేరుతో యువతరాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభరు విమర్శించారు. దేశాన్ని శాశ్వతంగా బంధీగా మార్చుకునేందుకు ఆర్ఎస్ఎస్ యత్నిస్తున్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగా అగ్నిపథ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఎనిమిదేండ్లలో ప్రజామోదం కలిగిన ఒక్క కార్యక్రమాన్ని కూడా మోడీ చేపట్టలేదనీ, వన్ నేషన్ వన్ ఎవ్రీథింక్ నినాదంతో మోడీ దేశాన్ని ఫాసిస్టు ఏకీకృత పద్ధతిలో పాలిస్తున్నారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా మేథావులు, కార్మికులు, కర్షకులు, పీడిత వర్గాలు, విప్లవపార్టీలు, ప్రశ్నించే గొంతుకలన్నీ ఒకే తాటిపైకి వచ్చేకాలం దగ్గరలోనే ఉందన్నారు. మోడీ ఒంటెత్తు పోకడలతో దేశం వందేండ్లు వెనక్కి నెట్టివేయబడుతున్నదని తెలిపారు. విపక్షాలతో చర్చించకుండా, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా అగ్నిపథ్ వంటి అతిపెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్ ప్రవేశపెట్టడంలోని లోతైన అర్థాన్ని యువత అర్థం చేసుకోవాలని సూచించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత కదలాలనీ, మేథావులు, కార్మిక, కర్షకలోకం యువతకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.