Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆసియా, ఇండియా మీడియా ఎక్చ్సేంజ్‌లో భాగంగా పది ఆసియా దేశాలకు చెందిన 20 మంది జర్నలిస్టుల బృందం ఆదివారం రాష్ట్రం లోని పలు సంస్థల్ని సందర్శించింది. ఆయా సంస్థల పనితీరు, భవిష్య త్ అభివృద్ధి ప్రణాళికలు తదితర అంశాలు అడిగి తెలుసుకుంది. దీనిలో భాగంగా వారు ఆదిభట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను సందర్శిం చారు. టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వీ రాజన్న, టాటా గ్లోబల్ హెడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్, మీడియా అండ్ టెక్నాలజీ బిజినెస్ విభాగా ల అధిపతులు వారిని ఆహ్వానించి, టాటా కంపెనీ విశిష్టత, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టీసీఎస్ అందిస్తున్న ఐటీ సేవలు, వార్షిక టర్నోవర్, ఉద్యోగులు సంఖ్య, హైదరాబాద్‌లో ఉన్న కార్యాల యాలు, మహిళా ఉద్యోగుల సంఖ్య, భవిష్యత్ ఐటీ విస్రృతి తదితర అంశాలను వివరించారు. అనంతరం ఆ బృందం షామీర్పేటలోని భారత్ బయోటెక్‌ను సందర్శించింది. ఫార్మా రంగంలో ఆ సంస్థ చేస్తు న్న కృషి, కోవిడ్ వ్యాక్సిన్ గురించి కంపెనీ అధికారులు వారికి వివరించారు.